»   » రంభ పెళ్ళి ఏ తారీఖున అంటే...

రంభ పెళ్ళి ఏ తారీఖున అంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

జనవరి నెలలో నిశ్చితార్ధం జరుపుకున్న రంభ తిరుపతిలో ఏప్రియల్ 8న వివాహం జరుపుకోనున్నట్లు సమాచారం. అయితే వివాహాన్ని సింపుల్ గా కొద్దిమంది కుటుంబ పెద్దల సమక్షంలోనే జరపాలని వధూవరులు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. వివాహానంతరం ఏప్రియల్ 11న చెన్నైలోని ఓ పాపులర్ ఫైవ్ స్టార్ హోటల్ లో బంధు మిత్రులకు రిసెప్షన్ ఇవ్వటానికి ప్లాన్ చేసారు. రిసెప్షన్ కి తెలుగు,తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలను స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఇక రంభ వివాహం చేసుకోబోయే వ్యక్తి పేరు ఇంద్రకుమార్. తమిళనాడులో పుట్టి పెరిగిన ఇంద్రకుమార్ కెనడా, చైనా, చెన్నైలలో ఫ్యాక్టరీలు స్థాపించి వ్యాపారవేత్తగా మారాడు.'మేజిక్ వూడ్స్" పేరుతో ఆయన స్థాపించిన అంతర్జాతీయ గహోపకరణాల సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా రంభ ఎంపికై కోటిన్నర రూపాయల విలువైన కారును గెలుచుకొన్నారు. తర్వాత అతనితో ప్రేమలో పడి, ఆ ప్రేమ పెళ్లి వరకు తీసుకువచ్చింది. వివాహానంతం రంభ సినీ కెరీర్ కు స్విస్తి చెప్పి తన భర్తతో కెనడాలో స్థిరపడే అవకాశాలున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu