»   » రామోజీరావుకి సుమన్ కొత్త తలనొప్పి

రామోజీరావుకి సుమన్ కొత్త తలనొప్పి

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామోజీరావుకి తన రెండవ కుమారుడు సుమన్ కీ మధ్య చాలా కాలంగా వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ మధ్యన ఈటీవీ ప్రబాకర్ ని తప్పించి, తన కొడుకుని మచ్చిక చేసుకున్న రామోజీరావుకి మళ్లీ సుమన్ నుంచి కొత్త తలనొప్పి ఎదురైందని తెలుస్తోంది. రామోజీరావు తన ఛానెల్స్ లోని వాటాను సోనీ నెట్ వర్క్ కు అమ్మేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఈటీవీ 2 తప్ప ఛానెల్స్ అన్నీ డీల్ ఓకే అయితే సోనీ హ్యాండ్ ఓవర్ చేసుకోనుంది. ఈ నేపధ్యంలో సుమన్ తన తండ్రితో వాగ్వివాదానకి దిగినట్లు అంతర్గత సమాచారం.

ఈటీవీని ఎవరికి అమ్మటానికి వీల్లేదని పట్టుపడుతున్నాని చెప్తున్నారు. సుమన్ సంతకాలు సైతం డీల్ సమయంలో అవసరమని అవి సుమన్ పెట్టడానకి సముఖంగా లేరని చెప్పుకుంటున్నారు. అయితే రామోజీరావు మాత్రం సుమన్ మాట వినేలే లేడని తెలుస్తోంది. వీటిని అమ్మేసి వచ్చిన షేర్ తో ఆయన స్టార్ చైన్ హోటల్స్ కట్టాలని ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. మరి సుమన్ ఈ డీల్ ని కొనసాగనిస్తాడా.. రామోజీరావు ఏం చేస్తాడు అన్న విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక సుమన్ ప్రస్తుతం సొంతంగా టెలి ఫిలింలు తయారు చేసి తన ఛానెల్ లో వేసుకునే ఆలోచనలో ఉన్నాడు. సోనీ టీవీ వారు తీసేసుకుంటే తన క్రియేటివిని చూపుకోవటానికి ఛానెల్ ఉండదని వాపోతున్నాడు.

English summary
Ramoji is selling all his TV channels to Sony network except ETV2 but Suman is demanding share of money that will come in this deal. But Ramoji has an idea of coming up with a chain of star hotels and expand his empire.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu