»   » టాలీవుడ్ లో గుసగుసలు - రాణా, ఇలియానాల మేటరేంటి...

టాలీవుడ్ లో గుసగుసలు - రాణా, ఇలియానాల మేటరేంటి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

గోవా సుందరి, టాలీవుడ్ అందాల రాణి, నటి ఇలియాన డిసెంబర్ లో క్రిస్ట్ మస్ సందర్బంగ తన స్నేమితులను, శ్నేయోభిలాసులను, ఇంకా సినిమాకు సంబంధించిన వర్గాలను పిలిచి పెద్ద పార్టీ ఇచ్చింది. దేవదాసు సినిమాతో పరిచయమ్యి, పోకిరితో టాప్ ర్యాంక్ కు ఎదిగిన ఇలియానా, తనను పరిచయం చేసిన వైవి చౌదరిని, మహేష్ ను పార్టీలో లేకపోవటం, ఒక కొత్త హీరో రావటం సినీ సర్కిల్ లో పుకారుగా ఉంది.

ఇంతకీ ఆ కొత్త యంగ్ హీరో ఎవరంటే 'లీడర్"లో హీరోగా నటించిన 'రాణా" ఇలియాన విందుకు రాణా రావటమే కాకుండ, ఇలియానాకు మంచి బహుమతిని ఇచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం రాణా, ఇలియానా 'నేను నా రాక్షసి" అనే సినిమాలో నటిస్తున్నారు. సెట్ లో అనేక సార్లు కలసి నటించిన ఈ ఫైర్ ప్రస్తుతం ఎంతో సన్నిహితంగా ఉన్నారని ఫిలింనగర్ పుకార్లు. ఇంతకీ 'రాణా" ఇచ్చిన గిప్ల్ ఏంటో ఎవ్వరికీ తెలియటం లేదు. మొత్తానికి ఇలియానా హదయానికి గుచ్చుకొనే గిప్ట్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇలియానా కూడా రాణా ఇచ్చిన గిప్ట్ ను భయట పెట్టకపోవటం టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ మేటర్ గా ప్రచారమవుతుంది. అసలే 'రాణా" అమ్మాయిలంటే ఇట్టే ఆకర్షణకు లోనవుతాడని, మరి ఇలియానా విషయంలో రాణా ఇంకెంత లొంగిపోయాడోనని, టాలీవుడ్ టాక్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu