For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్: స్టార్ హీరోల కాంబో సెట్ చేసిన బడా ప్రొడ్యూసర్

  By Manoj
  |

  గతంతో పోలిస్తే ఈ మధ్య తెలుగులో ప్రయోగాత్మక చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రేక్షకుల అభిరుచిలో మార్పు రావడం వల్లే ఈ పరిస్థితి కనిపిస్తోంది. అందుకు అనుగుణంగానే టాలీవుడ్‌లోని హీరోలు కూడా కొత్త తరహా చిత్రాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగానే మల్టీస్టారర్ మూవీలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనికితోడు దర్శక నిర్మాతలు కూడా ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. దీంతో మల్టీస్టారర్ మూవీలు ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్ మూవీ సెట్ అయినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం.!

  ఎన్నో మల్టీస్టారర్‌లు.. అతడివే ఎక్కువ

  ఎన్నో మల్టీస్టారర్‌లు.. అతడివే ఎక్కువ

  ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో మల్టీస్టారర్ మూవీలు వచ్చాయి. ‘మనం', ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', ‘గోపాల గోపాల', ‘F2', ‘వెంకీమామ'తో పాటు దర్శకధీరుడు తెరకెక్కించిన ‘బాహుబలి' కూడా ఆ తరహాలో వచ్చినదే. ఇవి మాత్రమే కాదు... చిన్న పెద్ద హీరోల కలయికలో చాలా సినిమాలు రూపొందాయి. మరిన్ని ప్రాజెక్టులు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

   హిస్టరీలోనే ప్రతిష్టాత్మకంగా రాబోతుంది

  హిస్టరీలోనే ప్రతిష్టాత్మకంగా రాబోతుంది

  ఇప్పటి వరకు తెలుగులో తెరకెక్కిన మల్టీస్టారర్‌ మూవీలను మరిపించేలా రాబోతుంది దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR. టాలీవుడ్ హిస్టరీలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ స్ఫూర్తితోనే తెలుగులో మరిన్ని మల్టీస్టారర్ చిత్రాలు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్నాయి.

  అన్ని ఫ్యామిలీలు.. అదే పనిలో బిజీగా

  అన్ని ఫ్యామిలీలు.. అదే పనిలో బిజీగా

  ఇక, తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరున్న ఫ్యామిలీలు మల్టీస్టారర్ మూవీని తీయాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ కుటుంబంలోని హీరోలతో ‘మనం' తరహా సినిమాను అందించాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇందులో మెగా, నందమూరి, దగ్గుబాటి ఫ్యామిలీలు ముందున్నాయి. దీంతో ఫ్యాన్స్ ఆ తరహా సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

  ‘ఆచార్య' నుంచి ‘మహాసముంద్రం' వరకు

  ‘ఆచార్య' నుంచి ‘మహాసముంద్రం' వరకు

  తెలుగులో ఇప్పటికే కొన్ని మల్టీస్టారర్ మూవీలు పట్టాలపై ఉండగా, మరికొన్ని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. వీటిలో చిరంజీవి - రామ్ చరణ్ కలయికలో రాబోతున్న ‘ఆచార్య' ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ కూడా జరుపుకుంది. ఇక, మలయాళ సూపర్ హిట్ ‘లూసీఫర్' రీమేక్, ‘మహాసముద్రం', ‘F3' సహా మరికొన్ని పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి.

  టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్ సెట్

  టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్ సెట్

  మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తోన్న నేపథ్యంలో టాలీవుడ్‌లో అలాంటి సినిమా మరొకటి రాబోతుందని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఇండస్ట్రీలో వైరల్ అవుతోన్న సమచారం ప్రకారం... చాలా కాలంగా స్నేహితులుగా ఉన్న నేచురల్ స్టార్ నాని, దగ్గుబాటి వారి అబ్బాయి రానా కాంబినేషన్‌లో మూవీ సెట్ అయిందట. ఇది 2021లో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  Hero Sudheer Babu Special Interview On 'V' Movie
  హీరోల కాంబో సెట్ చేసిన బడా ప్రొడ్యూసర్

  హీరోల కాంబో సెట్ చేసిన బడా ప్రొడ్యూసర్

  నాని - రానా కాంబినేషన్‌లో రూపొందబోయే ఈ సినిమాను బడా ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు నిర్మించబోతున్నారట. ఓ పేరున్న రచయిత రాసిన కథతో ఈ మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది. అయితే, దీనికి దర్శకత్వం ఎవరు వహిస్తారన్నది మాత్రం బయటకు రాలేదు. రానా, నాని ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోన్న విషయం తెలిసిందే.

  English summary
  Rana acted with many other heroes in his aspiring career as a co-star. He teamed up with Akshay Kumar, Prabhas and other actors as well in the recent times. But then, the actor hasn’t done any pure two-hero film till date as many of those films had him either as a support actor or as a villain.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X