»   »  పొలిటకల్ హై డ్రామా చేస్తున్న డైరక్టర్ తేజ

పొలిటకల్ హై డ్రామా చేస్తున్న డైరక్టర్ తేజ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రానా, తేజ కాంబినేషన్ లో ఓ సినిమా రీసెంట్ గా ప్రారంభైన సంగతి తెలిసిందే. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం అందరూ ఓ లవ్ స్టోరీ ఉంటుందని భావించారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఇదొక హై ఇంటిన్స్ తో కూడిన పొలిటికల్ డ్రామా అని తెలుస్తోంది.

పూర్తి ఏక్షన్ ఎపిసోడ్స్ సాగే ఈ చిత్రం తేజ అద్బుతమైన స్క్రిప్టు రెడీ చేసారని చెప్తున్నారు. అలాగే రెగ్యులర్ రొమాన్స్ అదీ లేకుండా రానా,కాజల్ ఇద్దరూ ఇందులో భార్యా భర్తలుగా కనిపిస్తారని, ఒక రకంగా ఇది లీడర్ 2 అనిపించుకునే సినిమా అవుతుందని చెప్తున్నారు.

ముఖ్యంగా ఈ చిత్రంలో కాజల్ కు చాలా స్ట్రాంగ్ క్యారక్టర్ రాసారని, అందుకోసం కాజల్ కాస్త బరువు సైతం తగ్గించుకుని రెడీ అవుతోందని వినికిడి. ఈ చిత్రాన్ి పడాల సత్యనారాయణ..తమ వైష్ణవి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Rana, Kajal,Teja film is a political drama

తేజ తో కాజల్ దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వత నటిస్తోంది. కాజల్ ని తెలుగుకు లక్ష్మి కళ్యాణం చిత్రంతో పరిచయం చేసింది తేజనే. మళ్లీ ఇంతకాలం తర్వాత తేజ దర్శకత్వంలో నటిస్తోంది ఆమె. నాలుగైదు సంవత్సరాల క్రితం తేజ, వెంకటేష్ కాంబినేషన్ లో సావిత్రి అనే టైటిల్ తో సురేష్ ప్రొడక్షన్స్ లో ఓ చిత్రం అనుకోవటం జరిగింది. అయితే అనుకోని కారణాలతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. మళ్లీ ఇన్నాళ్ళకు ఆ క్యాంప్ హీరోతో తేజ సినిమా చేస్తున్నారు.

మరో ప్రక్క తేజ ..ప్రస్తుతం బాహుబలి 2 చిత్రం బ్రేక్ లో ఉన్నారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లారి. దాంతో ఈ రెండు చిత్రాలు సైమన్టైనిస్ గా ఈ రెండు చిత్రాలు షూటింగ్ జరగనున్నాయి. బాహుబలి గ్యాప్ లో ఈ చిత్రం షూటింగ్ కు వస్తారు.

రానా ఇప్పటికే ఘాజీ చిత్రం షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేసారు. తెలుగు, హిందీ భాషల్లో విడుదల అయ్యే ఈ చిత్రం ప్రమోషన్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. అంటే బాహుబలి 2 వచ్చే లోగా రెండు సినిమాలు పూర్తి చేస్తాడన్నమాట రానా.

English summary
Director Teja, Rana Daggubati film is an intense political drama laced with action. Rana and Kajal will play husband and wife in the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu