»   » చంద్రబాబుగా మారనున్న రానా?

చంద్రబాబుగా మారనున్న రానా?

Subscribe to Filmibeat Telugu

విలక్షణమైన పాత్రలని ఎంచుకుంటూ రానా నటుడిగా దూసుకుపోతున్నాడు. రానా ప్రస్తుతం ప్రయోగాత్మక పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. రానా నటిస్తున్న తాజా చిత్రం హాథీ మేరె సాథీ. ఈ చిత్రం హిందీ, తెలుగు మరియు తమిళ భాషల్లో రూపొందుతోంది. కాగా బాలకృష్ణ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ లో పలువురు ప్రముఖ నటులుపేర్లు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్లో ఎన్టీఆర్ చరిత్రని వెండి తెరపై ఆవిష్కరించనున్నారు.

ఎన్టీఆర్ జీవితంతో సంబంధం ఉన్న కీలకమైన పాత్రలన్నింటిని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఎన్టీఆర్ రోల్ లో బాలయ్య నటిస్తున్నాడు. ఎన్టీఆర్ పాత్ర తరువాత అంత్యంత ఆసక్తి రేపుతున్నా మరో పాత్ర ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ అల్లుడిగా, ఆ తరువాత రాజకీయ సలహా దారుడిగా ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో వ్యక్తిగత జీవితంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.

Rana to play Chandrababu role in NTR biopic

కాగా చంద్రబాబు పాత్రలో రాజశేఖర్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజగా జరుగుతున్న ప్రచారం ప్రకారం ఆ రోల్ కోసం రానా పేరు వినిపిస్తోంది. చంద్రబాబు యువకుడిగా ఉన్న సమయం నుంచే ఎన్టీఆర్ కు సన్నిహితుడిగా మారారు. ఆపాత్రకు రానా అతికినట్లు సరిపోతాడని అంటున్నారు.

English summary
Rana to play Chandrababu role in NTR biopic. NTR biopic became bigger and bigger day by day
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X