AA22xA6: అల్లు అర్జున్ తో మరోసారి రష్మిక రొమాన్స్.. నేషనల్ క్రష్ రోల్ ఏంటో తెలుసా?

నేషనల్ క్రష్, ఇండియాస్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప చిత్రంలో నటించిన తర్వాత ఈ ముద్దుగుమ్మకు పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. పుష్ప చిత్రం తర్వాత నుంచి రష్మిక మందన్నకు సౌత్ లోని బిగ్ ప్రాజెక్ట్స్ తో పాటు నార్త్ ఇండియాలోని బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాలీవుడ్ లోనూ భారీగా ఆఫర్లు అందుతున్నాయి. హిందీ ఇండస్ట్రీలో రష్మిక మందన్న క్రేజ్ వేరే లెవల్లో ఉంది.

ఇప్పటికే రష్మిక మందన్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మకు నార్త్, సౌత్ లోని ప్రధాన చిత్ర పరిశ్రమల్లో భారీ డిమాండ్ ఉంది. అల్లు అర్జున్ పుష్ప: రైజ్, పుష్ప 2 : ది రూల్, యానిమల్, ఛావా వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ బ్లాక్ బాస్టర్ హిట్స్ ను సొంతం చేసుకుంది. దాంతో రష్మిక మందన్నకు మరింత డిమాండ్ పెరిగింది. మరోవైపు ఆఫర్లు కూడా ఈ ముద్దుగుమ్మ ముంగిట వాలుతున్నాయి. ఈ క్రమంలోనే మరో బంపర్ ఆఫర్ ను అందుకుంది.

Rashmika Mandanna s Key Role in Allu Arjun Director Atlee Upcoming Project AA22xA6

పుష్పతో సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాలీవుడ్ రేంజ్ సినిమా తీయాలని పట్టుదలతో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో జవాన్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన తమిళ దర్శకుడు అట్లీతో చేతులు కలిపారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో తొలిసారిగా పాన్ వరల్డ్ సినిమా రాబోతున్న సంగతి కూడా విధితమే. ఈ ప్రాజెక్ట్ కు AA22xA6 వర్క్ టైటిట్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. షూటింగ్ కు సంబంధించిన ముందస్తు ప్రణాళికలు, నటీనటులు, టెక్నీషియన్ల ఎంపిక, లోకేషన్ల ఎంపిక, మ్యూజిక్ కు సంబంధించిన ప్రీవర్క్ కొనసాగుతున్నాయి.

కాగా ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణెను మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీపికా మెయిన్ లీడ్ గా నటిస్తోందని తెలుస్తోంది. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్నను కూడా ఫైనల్ చేశారని తెలుస్తోంది. కాగా మరోసారి అల్లు అర్జున్ తో కలిసి తెరపై అలరించబోతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ లో రష్మిక మందన్న విలన్ గా కనిపించబోతుందని సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. ఇప్పటికే విభిన్న పాత్రలతో అలరిస్తున్న రష్మిక మందన్న ఇక ఈ ప్రాజెక్ట్ లో, అది కూడా విలన్ గా ఎలాంటి పెర్ఫామెన్స్ ఇవ్వబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

AA22xA6 ప్రాజెక్ట్ ను కోలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపెనీ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. కళానిధి మారన్ ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్ ను వెచ్చిస్తున్నారని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక స్పైడర్ మెన్, అవెంజర్స్, జురాసిక్ వరల్డ్ వంటి టాప్ హాలీవుడ్ ఫిల్మ్స్ కు వీఎఫ్ఎక్స్ ను అందించిన సంస్థలు ఈ సినిమాకు పనిచేస్తుండటం విశేషం. యంగ్ టాలెంట్ సాయీ అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. 2027లో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: allu arjun atlee AA22xA6
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X