స్టార్ హీరోతో రష్మిక మందన్న రొమాన్స్.. భారీ ప్రాజెక్ట్‌లో నేషనల్ క్రష్?

బాలీవుడ్ స్టార్ హీరో, హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ గురించి స్పెషల్ గా సౌత్ ఆడియెన్స్ ను పరిచయం చేయాల్సిన పనిలేదు. గతంలో ధూమ్ 2 చిత్రంతో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో అందరికీ తెలిసిందే. ఇక రీసెంట్ గా వార్ 2 చిత్రంతో ఇండియా మొత్తంగా ఆడియెన్స్ ను అలరించారు. గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. కానీ ఈ భారీ యాక్షన్ ఫిల్మ్ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. దీంతో ఇటు జూనియర్ ఎన్టీఆర్, అటు హృతిక్ రోషన్ తమ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టారు.

కాగా ప్రస్తుతం హృతిక్ రోషన్ తన నెక్ట్స్ ఫిల్మ్ క్రిష్ 4ను తెరకెక్కించడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ను వార్ 2 చిత్రం రిలీజ్ కు ముందే అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చకాచకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నటీనటుల ఎంపికలో హృతిక్ రోషన్ బిజీగా ఉన్నారు. క్రిష్ 4 చిత్రాన్ని హృతిక్ రోషన్ స్వయంగా డైరెక్ట్ చేయబోతుండటం విశేషం. 25 ఏళ్ల కింద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన హృతిక్ రోషన్ ఇప్పుడు డైరెక్టర్ గా మెగా ఫోన్ పట్టుకోబోతున్నారు.

Rashmika Manddanna in talks for Hrithik Roshan Upcoming Film

క్రిష్ 4 చిత్రానికి హృతిక్ రోషన్ తండ్రి, బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డైరెక్టర్ రాకేష్ రోషన్ నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. యష్ రాష్ ఫిల్మ్స్ తో పాటు ఫిల్మ్ క్రాఫ్ బ్యానర్లలో భారీ స్కేల్లో ఈ చిత్రం రూపుదిద్దుకోబోతుందని టాక్. ప్రొడక్షన్ హౌజ్ ల ఇంకా స్పష్టత లేదు. ఇక ఇప్పటికైతే అన్ని బాధ్యతలను హృతిక్ రోషనే చూస్తారు. ప్రస్తుతం హీరోయిన్ల ఎంపికను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను ఫైనల్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు ప్రీతి జింటా, రేఖా కూడా కీలక పాత్రలు పోషించబోతున్నట్టు తెలుస్తోంది.

తాజాగా మరో కీలక పాత్ర కోసం ఇండియాస్ మోస్ట్ పాపులర్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నను కూడా ఎంపిక చేసే పనిలో ఉన్నారంట హృతిక్ రోషన్. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సినీ వర్గాలు తెలుపుతున్నాయి. తన పాత్రకు సంబంధించిన వివరాలు, అలాగే రెమ్యునరేషన్, షూటింగ్ డేట్స్ ఇతర అంశాలు సెట్ చేసుకొని రష్మిక మందన్న ఓకే చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే రష్మిక మందన్న బాలీవుడ్ లో ఛావా చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది, సల్మాన్ ఖాన్ తో సికిందర్ అనే చిత్రంతోనూ అలరించింది.

పైగా పుష్ప 1, పుష్ప 2 చిత్రాలతో నేషన్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా సౌత్ లో రష్మికకు మంచి పట్టు ఉంది. ఈ కారణాలతో క్రిష్ 4లో రష్మిక మందన్నను ఎంపిక చేశారని తెలుస్తోంది. దీనిపై మున్ముందు మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికైతే ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరోవైపు రష్మిక మందన్న నెక్ట్స్ మైసా, ది గర్ల్ ఫ్రెండ్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X