Just In
- 17 min ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 1 hr ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 9 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
- 11 hrs ago
అభిమాని పెళ్లిలో సడన్‌గా ప్రత్యక్షమైన స్టార్ హీరో.. అతిధులంతా షాక్!
Don't Miss!
- News
కుటుంబమంతా నగ్నంగా పూజలు.. మృతదేహంపై ముగ్గు వేసి... మదనపల్లె కేసులో భయంకర నిజాలు
- Automobiles
ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివరాలు
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బన్ని ‘రేసు గుర్రం’లో విలన్ సీన్స్ (ఆన్ లొకేషన్ ఫోటోలు)
హైదరాబాద్: అల్లు అర్జున్, కిక్ దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో 'రేసు గుర్రం' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో విలన్ గా...భోజపురి హీరో రవి కిషన్ చేస్తున్నారు.
రవికిషన్ ఈ చిత్రంలో శివారెడ్డి అనే పాత్రను పోషిస్తున్నారు. అతని పాత్ర ఓ రాజకీయనాయకుడుది అని తెలిస్తోంది. ఈ మేరకు రవికిషన్, అల్లు అర్జున్ పై సన్నివేసాలను అన్నపూర్ణా స్టూడియోలో నిన్న షూట్ చేసారు. ఈ చిత్రం విడుదల అయ్యాక తెలుగులోనూ పూర్తి బిజీ అవుతాననే నమ్మకంగా ఉన్నారు రవి కిషన్.
ఇందులో సలోని కీలక పాత్రలో నటిస్తోంది. సురేందర్‌రెడ్డి దర్శకుడు. నల్లమలుపు బుజ్జి, డా||వెంకటేశ్వరరావు నిర్మాతలు. మరో రెండు రోజుల పాటు ఇక్కడ చిత్రీకరిస్తారు. ఇప్పటికే లేట్ కావటంతో ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుపుతున్నారు.
స్పాట్ లొకేషన్ ఫోటోలు... స్లైడ్ షోలో...

అక్కడ నెంబర్ వన్...
రవి కిషన్ కి భోజపురిలో మంచి మార్కెట్ ఉంది. అక్కడ హీరోగా అతను చాలా హిట్స్ కొట్టారు. స్టార్ గా వెలుగుతున్నారు. అయితే ఆయనకు తెలుగులో చేయాలని ఎప్పటినుంచో ఉంది. ఈ విషయాన్ని గమనించే ఈ ఆఫర్ ఇచ్చారు.

నగ్మా లవర్ గా...
తెలుగులోనూ ఒక ఊపు ఊరిన నగ్మా కు లవర్ గా రవి కిషన్ పలు మార్లు వార్తల్లోకి ఎక్కారు. అయితే రవికిషన్ కి వివాహం అయ్యాకా ఆ బంధం తెలిపోయింది. నగ్మా, రవికిషన్ కాంబినేషన్ లో సినిమాలు వచ్చాయి.

పోటీకి సిద్దం...
రేసు గుర్రం చిత్రం వచ్చే సంక్రాంతి (జనవరి 11)రిలీజ్ కానున్నదని తెలుస్తోంది. అదే సంక్రాంతికి...మహేష్ 1 నేనొక్కడినే,బాలకృష్ణ జయకృష్ణ చిత్రాలు విడుదల అవుతాయి. ఆ రెండు పెద్ద చిత్రాలకు పోటీ ఇచ్చే విధంగా ఈ సినిమాని సురేంద్ర రెడ్డి రూపొందిస్తున్నట్లు చెప్తున్నారు.

ఎప్పుడో మొదలైనా...
రేసుగుర్రం చిత్రం గత సంవత్సరం అక్టోబర్లోనే ఈ చిత్రం అఫీషియల్‌గా ప్రారంభోత్సవం జరుపుకుంది. అయితే రకరకాల కారణాల వల్ల లేటయ్యి....ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటోంది. మధ్యలో ఇద్దరమ్మాయిలతో చిత్రం వచ్చి విజయవంతమైంది.

బైక్ రేసర్ గా...
ఈ చిత్రంలో అల్లు అర్జున్ బైక్ రేసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. బన్నీ ఆ సీన్స్ కోసం బైక్ రేస్ ట్రైనింగ్ అయ్యినట్లు తెలుస్తోంది. విలన్ రవికిషన్ కీ, అల్లు అర్జున్ కి మధ్య వచ్చే సీన్స్ కీలకంగా నిలుస్తాయని చెప్తున్నారు.

వేగంగా...
వినోదం, యాక్షన్‌ల మేళవింపు కథలో కనిపిస్తుందని యూనిట్ చెబుతోంది. ఇటీవలే విదేశాల్లో రెండు పాటల్ని చిత్రీకరించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.మాటల్లో చెప్పలేనిది చూపించాం అని చెప్తున్నారు. ఈ సినిమా కొన్ని షెడ్యూల్స్ మిగిలివున్నాయి. వాటిని కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి వేగంగా పనులను పూర్తి చేస్తున్నారు.

కొత్త తరహా...
రవి కిషన్ ఈ చిత్రం లో చేసే విలనీ కొత్త తరహాలో ఉంటుందని, తెలుగు తెరపై నిలిచిపోతుందని చెప్తున్నారు. ఈ సినిమా విడుదల అయ్యాక రవి కిషన్ ...ఇక్కడే బిజీ అయ్యినా ఆశ్చర్యపోనక్కర్లేదని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి.

ఎంజాయ్ చేస్తున్నా...
రవి కిషన్ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నానని ట్విట్ లో రాసారు. మాసివ్ యాక్షన్ సీన్స్ తనపై చిత్రీకరించారని అంటున్నారు. చాలా పాజిటివ్ గా ఫీల్ అవుతున్నానని తన అభిమానులకు ఆయన అన్నారు.

భోజపురిలో కూడా...
రవికిషన్ చేస్తూండటంతో భోజపురి లో కూడా ఈ చిత్రం విడుదల అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు బిజినెస్ ఆఫర్స్ ...నిర్మాతకు వస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అలా అయితే మరో మార్కెట్ యాడ్ అయినట్లే..

అందుకే చేస్తున్నాడు..
అల్లు అర్జున్ కి ఉన్న మార్కెట్ ని గమనించిన రవికిషన్ ఈ చిత్రంలో చేయటానికి ఆసక్తి చూపించారని తెలుస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ చిత్రాలకు మళయాళంలో కూడా మంచి మార్కెట్ ఉండటంతో అక్కడా తను పాపులర్ అయ్యే అవకాసం ఉందని గమనించిన రవికిషన్ ..గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్తున్నారు.

డాన్ చూసే...
డాన్ రీమేక్ తో రవి కిషన్ చాలా పాపులర్ అయ్యారు. అతని స్టైలిష్ నటన చూసే సురేంద్ర రెడ్డి ఎంపిక చేసాడని చెప్తున్నారు. డాన్ చిత్రం అక్కడ విజయవంతమయ్యింది. ఇక రేసుగుర్రం తో రవికిషన్ కి ఇక్కడ పేరు వస్తే..అతని చిత్రాలు ఇక్కడ డబ్బింగ్ అవటం ఖాయం.

తమన్ సంగీతం ప్లస్....
ఈ చిత్రానికి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన తమన్ సంగీతం అందిస్తున్నారు. తమన్ ఇచ్చిన మ్యూజిక్‌పై తన అభిప్రాయాన్ని ఫేస్ బుక్ లో వెలుబుచ్చాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ స్పందిస్తూ...‘రేస్ గుర్రం చిత్రం కోసం తమన్ ఎక్సలెంట్ సాంగ్స్ ఇచ్చాడు. సినిమా ఆడియో విడుదల ఎప్పుడు జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. పాటలు సూపర్ హిట్టవడం ఖాయం' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కిక్ సినిమాతో హిట్ కొట్టి స్టార్ దర్శకుడిగా మారిన సురేందర్ రెడ్డి, ఆ తర్వాత ఊసరవెల్లితో బోల్తా పడ్డాడు. అయితే ఈచిత్రంతో ఎలాగైనా హిట్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. పేరుకు తగ్గట్టు అల్లు అర్జున్ పాత్ర తీరు జెట్ స్పీడుతో ఉంటుందని చెప్తున్నారు.

బన్ని ‘రేసు గుర్రం’
ఇప్పటి వరకు ఈ సినిమా ప్రొడక్షన్ టీం ఈ సినిమాకు సంబందించిన ఎటువంటి ప్రకటన చేయలేదు. నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.