»   » సరిగ్గా గమనిస్తే అక్కడే తెలుస్తుంది - ఆ జంటకు కిక్ మీద కిక్..!?

సరిగ్గా గమనిస్తే అక్కడే తెలుస్తుంది - ఆ జంటకు కిక్ మీద కిక్..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాస్ హీరో రవితేజ నటించిన 'కిక్" ఎలాంటి విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మించిన 'కిక్" చిత్రంలో రవితేజ సరసన ఇలియానా నటించింది. ఈ చిత్రం మొత్తం మంచి కిక్ తో, ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో వుంటుంది. ఓ చిన్నారి ఆపరేషన్ కి సాయం చేయడానికి, అనాద బాలబాలికలకు సాయం చేయడానికి రవితేజ డబ్బున్నోళ్ళ దగ్గర వారికి చెప్పిమరీ దొంగతనం చేస్తూ పోలీస్ లకు సవాల్ విసురుతాడు. రవితేజని పట్టుకోవడానికి స్పెషల్ ఆఫీసర్ గా శ్యామ్ ని నియమిస్తారు. అయినా రవితేజను రెడ్ హ్యాండెడ్ గా మాత్రం పట్టుకోలేక పోతాడు. చివరికి తన లవర్ ఇలియానా కోరిక మేరకు పోలీస్ ఆఫీసర్ అయి ఛార్జ్ తీసుకుంటాడు. ఆ దొంగతనం చేసిన వాడిని పట్టుకోవడానికి రవితేజ డ్యూటిలో జాయిన్ అవ్వటంతో 'కిక్" చిత్రం కంప్లీట్ అవుతుంది.

సరిగ్గా గమనిస్తే అక్కడే తెలుస్తుంది..ఈ చిత్రానికి సీక్వెల్ వుందని..తన లవర్ కోరికమేరకు కష్టపడి చదివి పోలీసాఫీసర్ అయ్యానని రవితేజ చెప్పడంతో సినిమా అయిపోయిన తర్వాత శుభం కార్డుకు బదులు 'కిక్2" అని టైటిల్ వెయ్యడం చూస్తుంటే ఈ చిత్రానికి సీక్వెల్ ఖచ్చితంగా వుందని అర్థమవుతోంది. ఇక సీక్వెల్ చిత్రంలో రవితేజ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా వుంటాడని తెలుస్తోంది. 'కిక్" చిత్రం మంచి కిక్ తో సాగిపోగా 'కిక్2" మాత్రం రొమాంటిక్ అండ్ మాస్ మసాలా ఎంటర్ టైనర్ చిత్రంగా రూపొందించడానికి దర్శకుడు సురేందర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం. కిక్ 2 సీక్వెల్ కి ప్రభాస్ అయితే బాగుంటుందని సురేందర్ రెడ్డి అలోచనలో వున్నట్టు విశ్వసనీయ సమాచారం. మరి 'కిక్2" ని ఎవరు నిర్మిస్తారన్నది తెలియాల్సి వుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu