»   » ‘షాడో ఎఫెక్ట్’: మెహర్ రమష్ నెక్ట్స్ చిత్రం డ్రాప్ ?

‘షాడో ఎఫెక్ట్’: మెహర్ రమష్ నెక్ట్స్ చిత్రం డ్రాప్ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : మొన్న శుక్రవారం విడుదలైన 'షాడో 'చిత్రం ఫ్లాప్ ఎఫెక్ట్ దర్శకుడు మెహర్ రమేష్ మీద బాగానే పడిందని తెలుస్తోంది. ఈ చిత్రం తర్వాత భారీగా ప్రారంభించనున్న పవర్ ప్రాజెక్టు డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. వెలఫేర్ క్రియేషన్స్ బ్యానర్ పై రవితేజ హీరోగా ఈ చిత్రం అనుకున్నారు. అయితే ఇప్పుడు డ్రాప్ అయినట్లు తెలుస్తోంది.,

'షాడో 'చిత్రం కథ విషయానికి వస్తే...రాజరామ్(వెంకటేష్) తండ్రి రఘురామ్ (నాగబాబు) ఇన్విస్టిగేటివ్ జర్నలిస్ట్.. విలన్ నానా భాయ్ (ఆదిత్య పంచోలి) కి చెందిన అకృత్యాలు సేకరిస్తాడంతో ఎప్పటిలాగే .. వారు చంపేస్తారు. ఆ చంపినప్పుడు తన తల్లి(గీత) చెల్లి(మధురిమ) నుంచి దూరం అవుతాడు. ఆ తర్వాత పగ,ప్రతీకారాలతో పెరిగి పెద్దై షాడో పేరుతో మలేషియాలో ఉంటున్న విలన్స్ ఒక్కొక్కరని చంపేస్తూంటాడు. ఈ లోగా... సీన్ లోకి ఇన్సెపెక్టర్ ప్రతాప్(శ్రీకాంత్) వస్తాడు. ఆ ప్రతాప్ ఎవరో కాదు..మన షాడో చెల్లి భర్త...అంటే బావ. ఇంతకీ షాడో తన బావ ప్రతాప్ నుంచి తప్పించుకుంటూ తన రివేంజ్ ఎలా పూర్తిగా తీర్చుకున్నాడనేది మిగతా కథ.

ఈ చిత్రం రిలీజ్ కు ముందు మెహర్ రమేష్....సినిమా చూసాక...మెహర్ రమేష్ ఇలాంటి సినిమా తీయగలడా? అని అందరూ ఆశ్చర్యపోతారు. నా నిర్మాత నాతో పదే పదే చెప్పిన మాట ఇది. అలాగే వెంకటేష్‌గారి సతీమణి ఈ చిత్రాన్ని చూశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంజాయ్ చేశానన్నారామె. తమన్ పాటలెంత బాగా చేశాడో రీ-రికార్డింగ్ కూడా అంతే అద్భుతంగా చేశాడు. యాక్షన్ విషయానికొస్తే.. స్టన్ శివ సమకూర్చిన ఫైట్స్ థ్రిల్‌కు గురి చేస్తాయి. గోపీమోహన్, కోన వెంకట్, మార్తాండ్ కె. వెంకటేష్.. ఇలా అందరూ మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. ఒక్క సీన్ కూడా బోర్ అనిపించదు అని వివరించారు. దాని దానికి రివర్స్ లో జరిగింది.

English summary
Ravi Teja and Meher Ramesh were supposed to team up for a new film titled ‘Power’. The film was supposed to be produced by Welfare Creations banner. But if the latest news doing the rounds in Filmnagar is to be believed, the project has been dropped.
Please Wait while comments are loading...