నాగవంశీకి భారీ నష్టాలు.. రవితేజ మూవీకి కష్టాలు!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ నాగవంశీకి కూడా ప్రేక్షకుల్లో కాస్తా గుర్తింపు దక్కింది. ప్రతి సినిమా రిలీజ్ సమయంలో తను కూడా ప్రమోషన్స్ లో ఎంతో యాక్టివ్గా పాల్గొంటారు. సినిమాకు సంబంధించిన విషయాలను టీమ్ తో పాటు తాను కూడా ప్రత్యేక శైలిలో ఆకర్షించుకునేలా చెబుతారు. ఇక నాగవంశీ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో గుర్తుండిపోయే సినిమాలను నిర్మించారు. 2016 నుంచి ఈ బ్యానర్ లో వచ్చే సినిమాలపై మంచి హైప్ నెలకుంటోంది.
ప్రస్తుతం థియేటర్లలో నాగ వంశీ డిస్ట్రిబ్యూటర్ గా వార్ 2 చిత్రంతో ఏపీ +నైజాంలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. బాలీవుడ్ లో రూపుదిద్దుకున్న ఈ భారీ యాక్షన్ ఫిల్మ్ వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటించడంతో నాగవంశీ అత్యధిక డబ్బులు వెచ్చించి థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేశారు. ఏకంగా రూ.100 కోట్ల వరకు ఖర్చు చేశారు. భారీ అంచనాలతో వార్ 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఓపెనింగ్ డే సినిమాకు మిక్డ్స్ టాక్ అందింది. దీంతో వార్ 2కు ఫూట్ పాల్ తగ్గిపోయిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

ఫలితంగా నాగవంశీ భారీ నష్టాలను చవిచూస్తున్నారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరో విజయ్ దేవకొండ కింగ్డమ్ చిత్రం కూడా నష్టాలనే మిగిల్చిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవుతుండటంతో నాగ వంశీకి నష్టాల భారం పెరుగుతూనే వస్తోంది. దీంతో తన ప్రొడక్షన్ కంపెనీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న చిత్రాలన్నింటినీ పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందని సినీ ప్రముఖులు అంటున్నారు. ఈ క్రమంలో నాగవంశీ నష్టాలు.. ఇప్పుడు రవితేజ సినిమా మాస్ జాతర రిలీజ్ కు కష్టంగా మారింది.
కింగ్డమ్, వార్ 2 సినిమాలకు సంబంధించిన లాభనష్టాల లెక్కలు సరి చేసుకున్నాకే మిగితా సినిమాల విడుదలకు బయ్యర్లు సిద్ధం అంటున్నట్టు తెలుస్తోంది. దాంతో మాస్ మహారాజా రవితేజ సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో నటించిన మాస్ జాతర సినిమా వాయిదా పడబోతోందని తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ చివరిగా 'క్రాక్' చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు మాస్ జాతర చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
మాస్ జాతర చిత్రాన్ని భాణు భోగవరపు డైరెక్ట్ చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్య్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లలో నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. యంగ్ హీరోయిన్ శ్రీలీలా రవితేజ సరసన నటించింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇక ఆగస్టు 27న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తామని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ఏమౌతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











