»   » రవితేజను చెడగొడుతున్న మహేష్ బాబు..

రవితేజను చెడగొడుతున్న మహేష్ బాబు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెండితెర మీద నటుడిగా వెలిగిపోతున్న రవితేజకి డైరెక్టర్ అవ్వాలన్న కోరిక ఒకటి బలంగా వుందట. 'రవితేజ ఆర్టిస్టే కాదు...డైరెక్టర్ కూడా' అనిపించుకోవాలనేది ఆయన కోరిక. అయితే, అది ఇప్పుడే కాదట. 'డైరెక్షన్ తప్పకుండా చేస్తాను. అయితే, ఇప్పుడే కాదు. ఇంకా టైం వుంది. నేను చేసే సినిమా ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో వుంటుంది. పక్కా కమర్షియల్ సినిమాగా తీస్తాను. అవార్డులంటే నాకు ఇంట్రస్ట్ లేదు. మంచి హిట్ అయితే చాలు. అలాంటి సినిమానే తీస్తాను. అయితే, ఒక షరతు ఉంటుందక్కడ... అదేమిటంటే, అందులో నేను నటించను" అంటున్నాడు రవితేజ. మరి, రిస్క్ చేయడానికి రెడీ అయ్యే ఏ నిర్మాతైనా ఈయన డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఇప్పటి నుంచే ట్రై చేయచ్చు.

దీన్ని బట్టి ఇండస్ట్రీలో హీరోల మనస్తత్వాలను చూస్తే రవితేజ, మహేష్ బాబు భిన్న దృవాలు. ఏడాదికి ఒక్క సినిమా చేయడానికి మహేష్ ఆపసోపాలు పడుతుంటే అరక్షణం కూడా వృధా పోనీయకుండా చేతికి దొరికిన అవకాశానల్లా ఉపయోగించుకొని వీర స్పీడులో వెళ్తున్నాడు రవితేజ. ఫైనల్ గా ఫైనాన్షియల్ మ్యాటర్ లోకి వస్తే మాత్రం రవితేజకు అందనంత ఎత్తులో వుంటాడు మహేష్. సినిమాలకు తక్కువ, యాడ్లకు ఎక్కువ సమయం కేటాయించడమే మహేష్ సూత్రమని తెల్సుకున్న రవితేజ తాను కూడా ఏవైనా ఉత్పత్తులు దొరికితే బ్రాండ్ అంబాసిడర్ అయిపోదామని స్నేహితుల దగ్గర కలలు కంటున్నాడట.

'అవకాశం వస్తే చేస్తా. కానీ ఎవరూ ఇవ్వట్టేదే.."అని రవితేజ అన్నాడంటేనే తన మనసులోని మాట ఎంటో తెలసిపోయింది. మరి మాస్ హీరోగా చక్కగా నిలబడ్డ ఈ మాస్ మహారాజ్ ని మన యువరాజు చెడగొడుతున్నాడన్న మాటేగా...

English summary
Ravi Teja started his filmy career as an assistant director and now he is the actor with his own market in the film Industry. will he direct a film in the future?'One day, I will defiantly become director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X