Don't Miss!
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
Walter Veeraiah: చిరంజీవి మూవీ నుంచి రవితేజ ఔట్.. కారణం ఇదే.. అతడి బదులు స్టార్ హీరో!
ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోని బడా స్టార్లు అందరూ మల్టీస్టారర్ మూవీలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలా ఇప్పటికే ఎంతో మంది హీరోలు హీరోలు తోటివాళ్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరిన్ని మల్టీస్టారర్ మూవీలు రాబోతున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి.. కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా ఒకటి. ఇందులో మరో హీరో కూడా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఎప్పుడో ప్రకటించింది. ఆ పాత్రకు మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మాస్ హీరో చిరంజీవి సినిమా నుంచి తప్పుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూడండి!

ఆచార్యతో చిరంజీవికి భారీ నిరాశ
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మించాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు నిరాశే మిగిలింది. ఫలితంగా ఈ మూవీకి రూ. 80 కోట్లకు పైగా నష్టాలు వచ్చాయి.
బీచ్‌లో లోదుస్తుల్లో యాంకర్ స్రవంతి రచ్చ: తడిచిన అందాలతో ఘోరంగా!

ఆ రెండు సినిమాలు పూర్తి చేసేసి
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్‌ను ‘గాడ్ ఫాదర్' టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు. దీన్ని మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు. దీని అనంతరం మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళంలో బంపర్ హిట్ అయిన వేదాళం చిత్రాన్ని ‘భోళా శంకర్'గా రీమేక్ చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన షూటింగ్‌లను దాదాపుగా పూర్తి చేసుకున్నారు.

బాబీతో వాల్తేరు వీరయ్య సినిమా
మెగాస్టార్ చిరంజీవి.. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న టాలెంటెడ్ డైరెక్టర్ కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతోనూ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.
షర్ట్ విప్పేసి షాకిచ్చిన ఈషా రెబ్బా: తెలుగమ్మాయి అందాలు చూస్తే అంతే!

వాల్తేరు వీరయ్యలో రవితేజ రోల్
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా మల్టీస్టారర్ జోనర్‌లో తెరకెక్కబోతున్నట్లు దర్శకుడు బాబీ ఎప్పుడో ప్రకటించాడు. దీంతో ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే హీరో ఎవరన్న దానిపై ఎన్నో రకాల చర్చలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆ పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నట్లు చాలా రోజుల క్రితమే ఓ న్యూస్ లీకైంది.

చిరు మూవీ నుంచి రవితేజ ఔట్
మెగాస్టార్
చిరంజీవి
-
బాబీ
కాంబినేషన్‌లో
రూపొందనున్న
సినిమాలో
రవితేజ
పాత్ర
ఎంతో
హైలైట్‌గా
ఉండబోతున్నట్లు
జోరుగా
ప్రచారం
జరుగుతోంది.
ఇందులో
ఈ
మాస్
హీరో..
చిరుకు
అభిమానిగా
నటిస్తున్నట్లు
కూడా
వార్తలు
వచ్చాయి.
ఈ
నేపథ్యంలో
రవితేజ
ఈ
సినిమా
నుంచి
తప్పుకున్నాడని
తాజాగా
ఓ
న్యూస్
ఫిలిం
నగర్
ఏరియాలో
విపరీతంగా
వైరల్
అవుతోంది.
నాగబాబుకు ఫేమస్ కమెడియన్ వార్నింగ్: ఏమనుకుంటున్నావ్.. ఇది కరెక్ట్ కాదు అంటూ!

రవితేజ తప్పుకోడానికి కారణమిదే
వాస్తవానికి మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇందుకోసం అసలేమాత్రం గ్యాప్ తీసుకోకుండా షూటింగ్‌లలో పాల్గొంటున్నాడు. మరోవైపు, చిరంజీవి - బాబీ మూవీ కూడా ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు రవితేజ డేట్స్ ఇవ్వలేని పరిస్థితి వచ్చిందట. అందుకోసమే అతడు దీని నుంచి తప్పుకున్నట్లు తెలిసింది.
Recommended Video


రవితేజ స్థానంలో మరో స్టార్ హీరో
ఇండస్ట్రీలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. చిరంజీవితో చేసే సినిమా కోసం డైరెక్టర్ బాబీ మరో హీరోను తీసుకోబోతున్నాడట. రవితేజ చేయాల్సిన పాత్రకు తగ్గట్లుగానే మరో స్టార్ హీరోను ఎంపిక చేయాలని అతడు భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొందరు హీరోలతో అతడు సంప్రదింపులు కూడా చేశాడట. అందులో ఒక స్టార్‌ను తీసుకోవాలని చిరంజీవి డిసైడ్ అయ్యారని టాక్.