»   » 'వీర' ఫ్లాప్ తో రియలైజ్ అయిన రవితేజ..!

'వీర' ఫ్లాప్ తో రియలైజ్ అయిన రవితేజ..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన వీర చిత్రం రీసెంట్ గా విడదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.ఎన్నో అంచనాలతో వచ్చిన వీర సినిమాకి తొలిరోజునుంచే ప్లాప్ టాక్ వచ్చేసింది. అయితే నిర్మాతలు మాత్రం యధావిధిగా కలెక్షన్ల రికార్డులు విడుదలచేసి ప్రమోషన్ తో సినిమాని బతికించాలని చూస్తున్నారు. అయితే ఈ చిత్రం ప్లాప్ తో రవితేజకు పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు.ఎందుకంటే వరస హిట్స్ తో దూసుకుపోతున్న రవితేజకు ఇది చిన్న బ్రేక్ అవుతుందేమో కానీ..పెద్దగా ఇబ్బంది ఎదురుకాదు.

'వీర" ఫలితం రవితేజలో కొన్ని మార్పులు తీసుకొస్తుంది. ఇక నుంచి చేసే ప్రతి సినిమా కథ విషయంలో పర్టిక్యులర్ గా వుండాలని, ప్రేక్షకులు తన నుంచి ఆశిస్తున్న సినిమాలే చేయాలని, ఎటువంటి అబ్లిగేషన్స్ కు తలవంచి దర్శకత్వం అవకాశం ఇవ్వకూడదని రవితేజ గట్టిగా నిర్ణయించుకున్నాడట. తనకు ఇవ్వాల్సిన పారితోషికం ఇస్తే రవితేజ ప్లాఫ్ లో వున్నా దర్శకుడికైనా, నిర్మాతకైనా సినిమా చేస్తాడనే రూమార్ టాలీవుడ్లో వుంది. ప్రస్తుతం దీని నుంచి కూడా బయటపడటానికి సినిమాలు చేసే విషయంలో అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రవితేజ ఆలోచిస్తున్నాడట. సో..ఇక వీర ఫలితం ఆ చిత్ర దర్శక, నిర్మాతలకు హ్యాపీగా లేకపోయినా..రవితేజకు మాత్రం రియలైజ్ అవ్వటానికి ఉపయోగపడింది..

English summary
Mass Raja Ravi Teja, who is on a mission of doing three to four films per year, is signing in every Tom Dick and Harry to direct his films. Sometimes the risk pays off and sometimes doesn’t. And at times it proves disastrous like it is with 'Veera'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu