»   » రవితేజ కొత్త చిత్రం టైటిల్,ట్యాగ్ లైన్ ఖరారు

రవితేజ కొత్త చిత్రం టైటిల్,ట్యాగ్ లైన్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
 Ravi Teja
హైదరాబాద్ :రవితేజ హీరోగా రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి) దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం చిత్రానికి 'పవర్'అనే టైటిల్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి 'అన్ లిమెటెడ్' అనే ట్యాగ్ లైన్ ని పెడుతున్నారు. టైటిల్ కి తగ్గట్లు రవితేజ పూర్తి పవర్ ని ఈ చిత్రం చూపెడుతుందని చెప్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్ గా రవితేజ కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది.

'బలుపు' చిత్రం నుండి బాబితో తాను ప్రయాణమవుతున్నానని, ఓ మంచి కథ చెప్పడంతో ఈ సినిమా ప్రారంభిస్తున్నామని రవితేజ తెలిపారు. మ్యూజికల్‌గా ఈ చిత్రం సూపర్‌హిట్ స్థాయిలో ఉంటుందని, రవితేజ, నిర్మాత తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, నిర్మాతతోపాటు మంచి యూనిట్ దొరికినందుకు ఆనందంగా ఉందని దర్శకుడు బాబి తెలిపారు.

నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ మాట్లాడుతూ- తాను నిర్మిస్తున్న స్ట్రెయిట్ తొలి తెలుగు చిత్రం ఇదేనని, నాలుగేండ్లుగా రవితేజతో చిత్రం నిర్మించాలని ప్రయత్నాలు చేస్తున్నామని, బాబి చెప్పిన కథ నచ్చడంతో చాలా తక్కువ సమయంలో నిర్మాణం చేపట్టామని తెలిపారు. విక్రమార్కుడు స్టైల్లో రవితేజ ప్రేక్షకులను ఈ చిత్రంలో అలరిస్తారని, ప్రతి సంవత్సరంలో తెలుగులో ఒక చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

హన్సిక తొలిసారిగా రవితేజతో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి, రావూ రమేష్, సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖావాణి, జోగి బ్రదర్స్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం:ఎస్.ఎస్.తమన్, కెమెరా:ఆర్థర్ ఎ.విల్సన్, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:కోన వెంకట్, నిర్మాత:రాక్‌లైన్ వెంకటేష్, కథ, దర్శకత్వం:కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి).

English summary
Ravi Teja has started working for a new film. This untitled film is being directed by newcomer Bobby, writer of Ravi Teja's recent hit, Balupu.The film is titled Power. And the tag line is 'Unlimited'. Ravi Teja will be seen as cop in this film. The film is currently being progressed in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu