»   » పవన్ కళ్యాణ్ ప్రస్దావించిన రాజా రవితేజ ఇతనే(ఫోటో)

పవన్ కళ్యాణ్ ప్రస్దావించిన రాజా రవితేజ ఇతనే(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : "నేనిలా రావడం మిత్రుడు త్రివిక్రమ్‌కు ఇష్టం లేదు. చెప్పకుండా వచ్చేశా. కామన్‌ మేన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఎక్కడికీ వెళ్లలేదు. నా గుండెల్లో రగులుతోంది. అదే ఇప్పుడు జనసేన. నాటి నుంచీ నేటి వరకూ నా కూడా ఉన్నది ఒక్కరే. రాజా రవితేజ. వరంగల్‌ జిల్లా. అతను నేను రోజూ 8-9 గంటలు మధన పడుతూనే ఉన్నాం. పార్టీ పెట్టాలని కాదు. ఈ రోజు నా వెనక పెద్దోళ్లు, డబ్బున్న వాళ్లు లేరు. రాజా రవితేజానే ఉన్నాడు" అంటూ పవన్ తన పొలిటికల్ స్పీచ్ లో ఎమోషనల్ గా చెప్పారు. దాంతో అందరికీ ఎవరీ రాజా రవితేజ అనే సందేహం వచ్చింది. మీరు ప్రక్కన ఫోటోలో చూస్తున్న వ్యక్తే రాజా రవితేజ.

ఇక అందిన సమాచారం ప్రకారం రాజు రవితేజ కరీంనగర్ జమ్మికుంటకు చెందిన వ్యక్తి. ఆయన ప్రజారాజ్యం సమయం నుంచి పవన్ తో ఉన్నారు. ఆయన పవన్ రాజకీయాల్లోకి రావటానికి కీలకమైన పాత్రను పోషించారు. ఆయనే తెలంగాణా సమస్యలపై పవన్ కళ్యాణ్ పూర్తి స్ధాయి విషయ సేకరణ చేసి సమాచారం అందించారు. ఆయన పవన్ కి అభిమాని మాత్రమే కాదు..మంచి స్నేహితుడు కూడా. తదుపరి మీటింగ్ లలో పవన్ ఆయన్ను మీడియా సమావేశానికి తీసుకు వస్తారని తెలుస్తోంది.

Ravi Teja ...The man behind Pawan political entry

ఇక పవన్ రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాననే విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. ''నా కోసం వచ్చిన, టీవీల్లో చూస్తున్న, రాష్ట్రంలో, దేశంలో ఉన్న తెలుగువారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేనున్న పరిస్థితిని, ఉండబోయే పరిస్థితిని చెప్పాలంటే...''అసలే చీకటి...గాడాంధాకారం. దారంతా గతుకులు. చేతిలో దీపం లేదు. కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ధైర్యం ఉంది. దేవరకొండ బాలగంగాధర తిలక్‌ రాసిన పద్యంలోని ఈ వాక్యాలే చిన్నప్పటి నుంచి నాకు స్ఫూర్తి. ఆంగ్లంలో ఒక సామెత ఉంది. చాలా గొప్పగా బతకాలంటే...చాలా భయంకర ప్రమాదాల్ని ఎదుర్కోవాలని. నేనేమీ గొప్పగా బతకాలని అనుకోలేదు. కానీ ప్రతిసారీ ప్రాణం పోయే సమస్యే వచ్చింది. ఇలాంటి సమస్యలన్నీ నా జీవితంలోనే ఎందుకొస్తున్నాయని ఆలోచించా. ఎందుకంటే నీ బాంచన్‌ దొర, నీ కాల్మొక్తా అనలేదు కాబట్టి.

ఢిల్లీలో కూర్చున్న వారందరి దగ్గరకు వెళ్లి సలాం అన్న నాయకులే రాష్ట్రానికి ఈ పరిస్థితి తీసుకొచ్చారు. ఐదేళ్ల క్రితం గుంటూరులో అన్నయ్య పెట్టిన ప్రజారాజ్యం తరఫున చివరిసారిగా ఎన్నికల ప్రసంగం చేశాను. తర్వాత నోరు విప్పలేదు. కానీ రాష్ట్ర రాజకీయ పరిస్థితి కానీ, విడిపోయిన తర్వాత నా తెలంగాణ, మన తెలంగాణ...సీమాంధ్రలుగా విడిపోయిన పరిస్థితి, విడగొట్టిన తీరు చూశాం. ఎలాంటి పరిస్థితుల్లో విడగొట్టారో చూశాం. రాజకీయ నేతలపై అసహ్యం వేసింది. 25 ఏళ్ల సుదీర్ఘ లక్ష్యంతో మీ ముందుకొచ్చా. పార్టీ పెట్టా. పేరు జనసేన. అది మీ సేన. సామాన్యుల సేన. అది పార్టీ జెండా(వెనక ఎల్‌ఈడీ తెరపై ఉన్నది చూపిస్తూ). పెట్టేముందు ఆలోచించా. దుర్మార్గ రాజకీయాలకు వ్యతిరేకంగా రావాలా? గుండెల్లో పెట్టుకున్న అన్నయ్యకు వ్యతిరేకంగా రావాలా? అన్నది ఆలోచించా. వెనక్కి వెళ్లిపోతే పిరికి వాడంటారేమో. చివరికి ఇక్కడికి వస్తున్నట్లు నాలుగు రోజుల క్రితం వరకూ నా కుటుంబ సభ్యులకు తెలీదు అన్నారు.

English summary
Meet Mr Raju Ravi Teja, the man credited with having encouraged Pawan Kalyan to make his political debut. Pawan Kalyan launched his new political party ‘Jana Sena’ at Hitex and in his elobarated speech Pawan Kalyan specially mentioned the name of one man who helped in his political entry and his name is Ravi Teja.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu