»   » రాజమౌళి 'మర్యాద రామన్న' కి ఆ స్టార్ హీరో వాయస్ ఓవర్

రాజమౌళి 'మర్యాద రామన్న' కి ఆ స్టార్ హీరో వాయస్ ఓవర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజమౌళి, సునీల్ కాంబినేషన్లో రెడీ అయిన మర్యాదరామన్న చిత్రంలో ప్రారంభంలో ఓ స్టార్ హీరో వాయిస్ ఓవర్ తో ప్రారంభమవుతుందంటున్నారు. అతనెవరో కాదు రవితేజ అని తెలుస్తోంది. అఫీయల్ గా రిలీజ్ చేసిన ధియోటర్ ట్రైలర్స్ చూసిన వారికి సైతం ఈ విషయం అర్ధమవుతుంది. ఈ ట్రైలర్స్ లో వాయిస్ రవితేజ. అయితే అతని వాయిస్ ని కేవలం ట్రైలర్ కి పరిమితం చేసాడా లేక చిత్రంలోనూ చెప్పించాడా అన్నది మాత్రం కొంత సస్పెన్స్ అంటున్నారు. ఇక జల్సాలో మహేష్ బాబు...వాయిస్ ఓవర్ చెప్పినాటినుంచి మొన్న రిలీజైన పప్పుకి అల్లరి నరేష్ వాయిస్ ఓవర్ చెప్పటం దాకా కంటెన్యూ అవుతోంది.

ఇక ఈ చిత్రం కథని రాజమౌళి కొద్ది రోజుల క్రిందట రివిల్ చేసారు. ఆయన మాటల్లోనే పాత కక్షల నేపథ్యంలో తను కనిపిస్తే చంపేద్దామని ఎదురుచూస్తున్న విలన్ ఇంటికే హీరో అతిథిగా వెళ్తాడు. ఆ ఇంట్లో ఉన్నంతసేపూ అతను అతిథి దేవుడే. గుమ్మం దాటితే శత్రువు. విలన్ ఇంట్లో హీరో ఎలా ఇరుక్కున్నాడు? అక్కడి నుంచి బయటపడ్డాడా లేదా అనే విషయం వినోదాత్మకంగా చెబుతున్నాం. హింస, రక్తపాతం లాంటివి మచ్చుకైనా కనిపించవు. నేనే పూర్తిగా సునీల్‌ శైలిలోకి మారి తీసిన సినిమా ఇది" అంటున్నారు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇది. ఇక ఈ రవితేజ వాయస్ ఇచ్చిన ట్రైలర్ ని http://www.youtube.com/watch?v=rga9YQ1lxyY&feature=related లో చూడొచ్చు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu