»   » ‘సారొచ్చారు’ కి రవితేజ కి రెమ్యునేషన్ ట్విస్టు అందుకే...

‘సారొచ్చారు’ కి రవితేజ కి రెమ్యునేషన్ ట్విస్టు అందుకే...

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : రవితేజ తాజా చిత్రం 'సారొచ్చారు' ఆడియో ఎలాంటి హడావుడి, ఆడియో ఫంక్షన్ లేకుండా డైరెక్ట్ గా మార్కెట్లోకి రిలీజైన సంగతి తెలిసిందే. అంత పెద్ద బ్యానర్ లో అంత పెద్ద హీరో చిత్రంకి ఆడియో పంక్షన్ చేయకపోవటం ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంసమైంది. అయితే అలా పంక్షన్ చేయకపోవటానికి కారణమంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. రవితేజకు అశ్వనీదత్..రెమ్యునేషన్ విషయంలో ట్విస్ట్ ఇచ్చాడని, ఇంకా రెమ్యునేషన్ బ్యాలన్స్ ఉంచేసాడని, అందుకే రవితేజ తాను ఆడియో పంక్షన్ కి అటెండ్ కానని చెప్పడంటో హీరో లేకుండా ఆడియో పంక్షన్ ఎందుకని...ఇలా సైలెంట్ గా పంక్షన్ లేకుండా విడుదల చేసేసారని చెప్పుకుంటున్నారు.

  ఇక ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. రవితేజ ఇమేజ్ కు తగిన విధంగా ఈచిత్రంలో దేవిశ్రీ మాస్ బీట్లతో పాటు, వినసొంపైన మొలోడీలను కంపోజ్ చేసాడు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని వైజయంతిమూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఈచిత్రంలో రవితేజ సరసన కాజల్, రిచా గంగోపాధ్యయ్ హీరోయిన్లుగా చేసారు. డిసెంబర్ 21న ఈచిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  గతంలో రవితేజ-పరశురామ్ కాంబినేషన్లో 'ఆంజనేయులు' అనే ప్లాపు మూవీ వచ్చినప్పటికీ ఈ సారి మాత్రం సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారు నిర్మాత అశ్వినీదత్. ఈచిత్రాన్ని వైజయంతి మూవీస్ సమర్పణలో అశ్వినీదత్ కుమార్తె ప్రియాంక దత్ త్రీ ఏంజిల్స్ స్టూడియో ప్రై.లి.పై నిర్మిస్తున్నారు. మరో వైపు రవితేజ 'బలుపు' అనే చిత్రానికి కూడా కమిట్ అయ్యారు. గోపీచంద్‌ మలినేని ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

  ఈచిత్రాన్ని త్రీ ఏంజిల్స్ స్టూడియో బేనర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె ప్రియాక దత్ నిర్మిస్తున్నారు. గతంలో వచ్చిన రవితేజ వరుస మూస సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం ఉండబోతోంది. సినిమాలో వినోదానికి అధిక ప్రాధాన్యత నిచ్చారు. అదే విధంగా నిర్మాణ విలువలు కూడా భారీగా ఉండనున్నాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

  English summary
  Ravi Teja was not paid his remuneration for Sarocharu. It was told for this reason, the actor refused to attend the audio function of the movie and the makers had to release the music album directly in to market. On the other side, Sarocharu is gearing up for release on December 21st. Parasuram is directing the film and this is his second film with Ravi Teja after Anjaneyulu.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more