»   » రవితేజకు స్ట్రోక్ ఇచ్చిన గోపిచంద్

రవితేజకు స్ట్రోక్ ఇచ్చిన గోపిచంద్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజ హీరోగా, శ్రియ హీరోయిన్ గా నటించిన 'డాన్ శీను' చిత్రం ఆగస్టు 6వ తేదీన విడుదలవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇదివరకు రవితేజ సినిమాలకు దేనికీ జరగని విధంగా ఈ చిత్రం మూడు కోట్ల డెఫిషీట్ తో విడుదలవ్వాల్సిన పరిస్ధితి వచ్చింది. దీనంతటికీ కారణం గోపిచంద్. హీరో గోపీచంద్ కాదండీ, ఆర్.ఆర్.మూవీ మేకర్స్ బ్యానర్ ఫై నిర్మితమైన ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్న మలినేని గోపిచంద్.

దర్శకుడిగా మొదటి చిత్రం కావడంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మొత్తం చిత్రానికి 21 కోట్లు ఖర్చు పెట్టించేసాడట. సినిమా బడ్జెట్ రవితేజ మార్కెట్ కంటే మించిపోవడంతో నిర్మాత వెంకట్ రిలీజ్ కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా మేనేజ్ చెయ్యవలసి వచ్చింది. ఇందంతా మర్చి పోయే విధంగా డాన్ శీను కిక్ ఇస్తే బావుంటుదని దర్శక నిర్మాతలు ఆశిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu