»   » ‘సై రా’... ఈ వార్తలేంట్రా, ఫ్యాన్స్ అయోమయం, ఇప్పటికీ నో క్లారిటీ!

‘సై రా’... ఈ వార్తలేంట్రా, ఫ్యాన్స్ అయోమయం, ఇప్పటికీ నో క్లారిటీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sye Raa Narasimha Reddy faces trouble ‘సై రా’... ఈ వార్తలేంట్రా

మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 151వ సినిమా ప్రకటన ఆయన పుట్టినరోజు సందర్భంగా అట్టహాసంగా జరిగింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'సై రా నరసింహా రెడ్డి' అనే టైటిల్ ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో పాటు ఈ సినిమాకు పని చేస్తున్న ముఖ్య నటులు, టెక్నీషియన్స్ వివరాలు కూడా ప్రకటించారు.

సైరా' అక్టోబర్ 20 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. నానక్ రామ్ గూడ, ఫిల్మ్ సిటీ, అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ నిర్మాణం జరుగుతున్నట్లు సమాచారం.

అంతా సవ్యంగా సాగుతుంది అనుకుంటున్న తరుణంలో ఈ సినిమాకు అనుకోని ఆటంకాలు ఎదురవుతున్నాయంటూ ప్రచారం మొదలైంది. 'సై రా' సినిమా నుండి మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ తప్పుకుంటున్నాడంటూ పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. దీని గురించి మరిచిపోక ముందే మరో వార్త తెరపైకి వచ్చింది.


రవి వర్మన్ తప్పుకుంటున్నాడంటూ...

రవి వర్మన్ తప్పుకుంటున్నాడంటూ...

ఈ చారిత్రక చిత్రం నుంచి సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ తప్పుకున్నాడంటూ తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. ఇతర కమిట్‌మెంట్స్‌తో డేట్స్ అడ్జస్ట్ చేయలేక మెగాస్టార్ సినిమాకి రవివర్మన్ నో చెప్పినట్లు చర్చించుకుంటున్నారు. ఆయన స్థానంలో రత్నవేలును సినిమాటోగ్రాఫర్‌గా ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.


క్లారిటీ ఇవ్వని టీం

క్లారిటీ ఇవ్వని టీం

అయితే రెహమాన్, రవి వర్మ ఈ చారిత్రక ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లు అఫీషియల్ సమాచారం అయితే లేదు. బయట ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతున్నా.... చిత్ర యూనిట్ నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో మెగా అభిమానుల్లో అయోమయం నెలకొంది.


చిత్ర యూనిట్ ఆగస్టు 22న ప్రకటించిన వివరాల ముఖ్య తారాగణం, టెక్నీషియన్స్ వివరాలు

చిత్ర యూనిట్ ఆగస్టు 22న ప్రకటించిన వివరాల ముఖ్య తారాగణం, టెక్నీషియన్స్ వివరాలు

ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో, సౌత్ చిత్ర సీమలో బాహుబలిని మించిన సినిమా లేదు. అయితే 'బాహుబలి'ని మించేలా 'సై రా నరసింహారెడ్డి' సినిమా తెరకెక్కబోతోంది. ఊహకు కూడా అందని భారీ తారాగణంతో ఈ సినిమా రాబోతోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ తొలిసారిగా తెలుగు సినిమాలో నటించబోతున్నారు. ఈయనతో పాటు పలువురు స్టార్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది.


షెహన్ షా ఆఫ్ ఇండియన్ సినిమా అమితాబ్

షెహన్ షా ఆఫ్ ఇండియన్ సినిమా అమితాబ్

షెహన్ షా ఆఫ్ ఇండియన్ సినిమా, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ‘సైరా నరసింహారెడ్డి' చిత్రంలో కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. అయితే ఆయన ఏ పాత్రలో నటించబోతున్నారు అనేది త్వరలో ప్రకటించనున్నారు.


డేరింగ్ స్టార్ జగపతి బాబు

డేరింగ్ స్టార్ జగపతి బాబు

డేరింగ్ స్టార్ జగపతి బాబు ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆ పాత్ర వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్ర తెలిపింది.కిచ్చా సుదీప్

కిచ్చా సుదీప్

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూడా ఈ చిత్రంలో మెయిన్ రోల్ చేయబోతున్నారు. బాహుబలి సినిమాలోనూ కిచ్చా సుదీప్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సుదీప్ ద్వారా కన్నడ మార్కెట్ వశం చేసుకోవచ్చే ఉద్దేశ్యం కనిపిస్తోంది.


క్వీన్ ఆఫ్ సిల్వర్ స్క్రీన్ నయనతార

క్వీన్ ఆఫ్ సిల్వర్ స్క్రీన్ నయనతార

క్వీన్ ఆఫ్ ఆఫ్ సౌతిండియా సిల్వర్ స్క్రీన్ నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ఈవిడ నటించబోతున్నట్లు స్పష్టమవుతోంది.మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి

తమిళ స్టార్ విజయ్ సేతుపతి కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. విజయ్ సేతుపతి ద్వారా తమిళ మార్కెట్ లో మంచి వసూళ్లు సాధించవచ్చని దర్శక నిర్మాతల ప్రయత్నంగా కనిపిస్తోంది.


ఏఆర్ రెహమాన్

ఏఆర్ రెహమాన్

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్, ఇండియాలో నెం.1 గా పేరొందిన ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారు.రాజీవన్

రాజీవన్

ప్రొడక్షన్ డిజైనర్‌గా రాజీవన్ పని చేస్తున్నారు. గతంలో రాజీవన్ పలు అద్భుతమైన సినిమాలకు ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేశారు.పరుచూరి బ్రదర్స్

పరుచూరి బ్రదర్స్

సై రా నరసింహారెడ్డి చిత్రానికి పరుచూరి బ్రదర్స్ రచయితలు. మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, రచనా సహకారం: సత్యానంద్‌.ప్రొడ్యూసర్

ప్రొడ్యూసర్

ఈ చిత్రానికి మెగాస్టార్ తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సురేందర్ రెడ్డి

సురేందర్ రెడ్డి

ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సురేందర్ రెడ్డి కెరీర్లోనే ఇదే అతి పెద్ద ప్రాజెక్ట్. ఆయన ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నారు.
English summary
If ongoing buzz in media and film Industry is to be believed, the cinematographer Ravi Varman of upcoming film ‘Sye Raa Narasimha Reddy’ has been walked out from the project and the makers have brought top cameraman Rathnavelu on the board to handle the cinematography.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu