»   »  'బ్రహ్మోత్సవం'‌: కావాలనే రిలీజ్ డిలే, మహేష్ స్ట్రాటజీ?

'బ్రహ్మోత్సవం'‌: కావాలనే రిలీజ్ డిలే, మహేష్ స్ట్రాటజీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు బాగున్నాయి. అయితే అంచనాలు అందుకోవటం దర్శకులు, హీరో, టెక్నీషియన్స్ భాధ్యత అయితే సినిమాని సరైన టైమ్ లో రిలీజ్ చేసి, హిట్ చేయటం నిర్మాతల అవసరం.

దాంతో మే 7 న ఆడియోని విడుదల చేసి మే 27న చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. చాలా మంది చిత్రం రిలీజ్ ముందనుకున్న తేదీ కాకుండా విడుదల వాయిటం ఆశ్చర్యపరిచింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం చాలా స్ట్రాటజీగా ఈ వాయిదా వేసినట్లు సమాచారం.ట్రేడ్ వర్గాల నుంచి , ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం...మే 27న రిలీజ్ చేయటం వలన చాలా లాభాలు ఉన్నాయట. ముఖ్యంగా మహేష్ కు యుఎస్ మార్కెట్ ఎక్కువ. అక్కడ మే 27 న రిలీజ్ చేస్తే లాంగ్ వీకెండ్ వస్తుంది. ఎందుకంటే మే 30న మెమోరియల్ డే రావటం కలిసి వచ్చింది.


దాంతో అక్కడ మార్కెట్ ని కూడా దృష్టిలో పెట్టుకున్నారని తెలుస్తోంది. మరో ప్రక్క స్కూల్స్,కాలేజీలకు ఇండియాలో సమ్మర్ హాలీడేస్ కంటిన్యూ అవుతున్నాయి. అలా యుఎస్ లో లాంగ్ వీకెండ్ ని, ఇక్కడ సమ్మర్ హాలీడేస్ ని కలిసి వచ్చేలా డేట్ ఫిక్స్ చేసారని చెప్తున్నారు.


మరో ప్రక్క చిత్రం ప్రమోషన్స్ మొదలయ్యిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని 'వచ్చింది కదా అవకాశం.. ఓ మంచి మాట అనుకుందాం'.. అనే పాట లిరికల్‌ వీడియోను చిత్ర బృందం మంగళవారం విడుదల చేసింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ పాటకు సాహిత్యమందించగా, అభయ్‌ జోద్పూరకర్‌ పాడాడు. ఇటీవలే ఈ చిత్రంలోని మధురం.. మధురం పాట టీజర్‌ను విడుదల చేశారు.ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌, సాంగ్ టీజర్స్ కు మంచి స్పందన వస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తి చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.


'వచ్చింది కదా అవకాశం... ఓ మంచి మాట అనుకుందాం... ఎందుకు ఆలస్యం... అందరినీ రమ్మందాం' అంటూ ఆంగ్ల సంవత్సరాది నాడు టీజర్‌తో ప్రేక్షకులను పలకరించాడు మహేష్‌బాబు. ఇప్పుడు మొన్న వదలిన సాంగ్ టీజర్, మోషన్ పోస్ట్రర్స్ తో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.


పీవీపీ సినిమా అధినేత ప్రసాద్‌ వి.పొట్లూరి మాట్లాడుతూ ''బ్రహ్మోత్సవం' చిత్రానికి మహేష్‌బాబు ఆయువు లాంటివారు. శ్రీకాంత్‌ అడ్డాల కథలో మహేష్‌ను చూస్తుంటే కనులపండువగా ఉంది. ప్రతి కుటుంబంలో జరిగే ఉత్సవంలా ఉంటుందీ సినిమా.


మహేష్‌ మాయ, శ్రీకాంత్‌ అడ్డాల మార్కు, కళా దర్శకుడు తోట తరణి పనితనం, రత్నవేలు కెమెరా నైపుణ్యం, మిక్కీ జె.మేయర్‌ సంగీతం... ఇలా అన్నీ కలసి సినిమా అద్భుతంగా రూపొందుతోంది. ఈ సినిమా చూసి ప్రతి వ్యక్తి తనను తాను సినిమాలో చూసుకుంటాడు.


ఆ వ్యక్తి ధనికుడా, పేదోడా అనేది విషయం కాదు. అందుకే 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని ప్రతి ఒక్కరి ఇంట్లో ఉత్సవం అంటున్నాం. సినిమా పేరులోనే కాదు ఆడియో నుంచి సినిమా విడుదల వరకు అన్నీ బ్రహ్మాండంగా ఉండేలా చూసుకుంటున్నాం.నాలుగు వారాలు ఆడి డబ్బులు సంపాదించే సినిమా తీయడం మా సంస్థ ఉద్దేశం కాదు. కలకాలం నిలిచిపోయే సినిమాలు చేయడమే మా అభిమతం. అదే ఆలోచనతో సినిమాలు చేస్తున్నాం. ఇకపై కూడా చేస్తామ''అన్నారు ప్రసాద్‌ వి.పొట్లూరి.


దర్శకుడు మాట్లాడుతూ ''వినోదాత్మకంగా నడిచే కుటుంబ కథాచిత్రమిది. ముగ్గురు హీరోయిన్స్ కు పాత్రలకూ ప్రాధాన్యముంది. ఉమ్మడి కుటుంబంలోని సంతోషాలకు ప్రతిరూపంగా ఈ చిత్రం ఉంటుంది''అన్నారు. జయసుధ, రేవతి, నరేష్‌, రావు రమేష్‌, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్‌ సంగీతమందిస్తున్నారు.

English summary
Mahesh strategically delayed the Brahmotsavam release. The film is releasing on May 27th and the weekend ahead is Memorial Day long weekend in USA.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu