For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కళ్యాణ్ నిర్మాతగా మారటానికి కారణం

  By Srikanya
  |

  హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ నిర్మాతగా మారుతూ... 'గబ్బర్ సింగ్' సీక్వెల్ కి ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దాంతో పవన్ తో సినిమా నిర్మించాలని ఎంతో నిర్మాతలు తిరగుతూంటే పవన్ ఎందుకు హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది. దానికితోడు ఈ సీక్వెల్ చిత్రాన్ని అంతా గణేష్ బాబు చేస్తాడని భావించారు. అయితే పవన్ ఈ చిత్రాన్ని తన ఐడియాలజితో నింపాలనుకుంటున్నారని, సమాజంపై తన ఆలోచనలు, మానవత్వం వంటివి ఈ రెండో భాగంలో ఎంటర్టైన్మెంట్ గా చెప్పాలనకుంటున్నారని తెలుస్తోంది.

  ఇక 'గబ్బర్ సింగ్' గత సంవత్సరం విడుదలైనా...జనాల్లో గబ్బర్ సింగ్ చిత్రంపై క్రేజ్ తగ్గలేదు. ఆ మధ్యన శివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని పలు చోట్ల మిడ్ నైట్ షోలలో భాగంగా గబ్బర్ సింగ్ చిత్రాన్ని కూడా ప్రదర్శించారు. ఈ సినిమా ప్రదర్శించిన అన్ని థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి. దీన్ని బట్టి 'గబ్బర్ సింగ్' మేనియా ఇంకా తగ్గలేదని స్పష్టం అవుతోంది. ఈ నేపధ్యంలో ...'గబ్బర్ సింగ్' సీక్వెల్ కి ఏ రేంజి ఓపినింగ్స్ ఉంటాయో ఊహించుకోవచ్చు. దాంతో పవన్ ఎక్కువ భాధ్యత తనపై పడినట్లు ఫీలై...నిర్మాణ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.

  ఇక 'గబ్బర్ సింగ్' చిత్రం బిగ్ స్క్రీన్‌పైనే కాదు... స్మాల్ స్క్రీన్‌పై కూడా సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇటీవల ఈచిత్రం బుల్లితెరపై మగధీర రికార్డును బద్దలు కొట్టింది. నెం.1 హిట్ సినిమాగా రుజువు చేసుకుంది. పవన్ కళ్యాణ్‌కు ఎంత ఫాలోయింగ్ ఉందో నిరూపించింది. దాంతో శాటిలైట్ బిజినెస్ సైతం ఈ సీక్వెల్ కి ఓ రేంజిలో జరుగుతుంది. ఇటువంటి సమయంలో పెరిగిన అంచనాలను అందుకోవాల్సిన భాధ్యత ఎక్కువగా ఉంటుందని పవన్ భావిస్తున్నారు. అందుకే స్క్రిప్టు కూడా తనే భాథ్యత తీసుకుని మొదలెట్టారు.

  పవన్ కళ్యాణ్ మొదటి నుంచీ క్రియేటివ్ గా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. ఫైట్స్,డాన్స్ దగ్గరనుంచి ప్రత్యేకంగా డిజైన్ చేసుకునే ఆయన తాజాగాఈ స్క్రిప్టు రాయటం మొదలుపెట్టారు. ఈ చిత్రాన్ని ఆయన స్వంతంగా తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన కథా చర్చలు సాగుతున్నట్టు సమాచారం.

  నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది... అంటూ 'గబ్బర్‌సింగ్‌'గా పవన్‌ కల్యాణ్‌ చేసిన సందడి అంతా ఇంతా కాదు. మొండిఘటం పోలీసు పాత్రలో ఆయన పంచిన వినోదం ప్రేక్షకుల్ని అలరించింది. తొలిభాగంలో పవన్‌కల్యాణ్‌ పోషించిన గబ్బర్‌సింగ్‌ పాత్ర శైలి, అందులోని భావోద్వేగాలు రెండో భాగంలోనూ కొనసాగుతాయని తెలిసింది. దర్శకుడు, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు పవన్‌. ఆ సినిమా పూర్తవగానే రెండో గబ్బర్‌సింగ్‌ సెట్స్‌పైకి వెళుతుంది.

  English summary
  Repeling all the specualtions and counter-anticipations, Pawan Kalyan made his mind not to allow any of the producers to invest on sequel to super hit 'Gabbar Singh.' Name of Bandla Ganesh Babu will no more be associated with 'GS 2' because Pawan himself wanted to risk on this. While story and script are not at all going to have any shades of 'Dabangg 2' yet Power Star will retain the fresh flavor mixed with comedy and action of 'Gabbar Singh.'
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X