రాశీఖన్నాపై రవితేజ ఇంట్రస్ట్‌కు కారణం అదే..
బెంగాల్ టైగర్ చిత్రం సందర్భంగా రవితేజ, రాశీఖన్నా ఇద్దరు క్లోజ్ అయ్యారట. ఆ కారణంగానే తన తాజా రెండు చిత్రాల్లో ఆమెను బుక్ చేసుకొన్నట్టు ఫిలింనగర్ సమాచారం.
గతేడాది సినిమాలకు దూరంగా ఉన్న రవితేజ ప్రస్తుతం ఒకేసారి రెండు చిత్రాలతో బిజీగా మారారు. అయితే ఈ రెండు చిత్రాల్లోనూ రాశీఖన్నానే హీరోయిన్ కావడం ఫిలింనగర్‌లో చర్చనీయాంశమైంది. కారణమేమిటని ఆరా తీస్తే బెంగాల్ టైగర్ చిత్రం సందర్భంగా రవితేజ, రాశీఖన్నా ఇద్దరు క్లోజ్ అయ్యారట. ఆ చిత్రంలో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ తెరపైన బాగానే వర్కవుట్ అయిందనే టాక్ కూడా వచ్చింది. ఆ కారణంగానే తన రెండు చిత్రాల్లోనూ రాశీఖన్నాను హీరోయిన్‌గా రికమెండ్ చేశారనే వార్త వినిపిస్తున్నది. అంతేకాకుండా అప్పటి నుంచి వారిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ కూడా పెరిగిందట.

దాని వల్లనే తొలుత దిల్ రాజు నిర్మించే చిత్రంలో రాశీఖాన్నానే హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యాడట. ఆ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఆ మధ్యలో దర్శకులు మారిన రాశీ పేరు మాత్రం మారలేదు. కారణమేమిటంటే.. ఒకసారి కమిట్ అయితే నిర్ణయాన్ని మార్చుకోడనే పేరు రవితేజకు ఇండస్ట్రీలో ఉంది. ఏదిఏమైనా రాశీ, రవితేజ ఫ్రెండ్ షిప్ చూసిన వారు.. స్నేహమంటే ఇలా ఉండాలని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











