»   » మాట తప్పిన వైవిఎస్, మెగా మేనల్లుడి ‘రేయ్’ జాప్యం!

మాట తప్పిన వైవిఎస్, మెగా మేనల్లుడి ‘రేయ్’ జాప్యం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ల మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'రేయ్'. వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 5వ తేదీన విడుదల కావాల్సి ఉంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రాన్ని ఫిబ్రవరి 20కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. పోస్టు ప్రొడక్షన్ పనులు లేటవ్వడం వల్లనే విడుదల ఆలస్యం అవుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

ఇటీవల జరిగిన 'రేయ్' మూవీ ఆడియో వేడుకలో వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ...ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను ఫిబ్రవరి 5వ తేదీన ప్రేక్షకులు ముందుకు తెస్తామని ప్రకటించారు. అయితే అపుడు చెప్పినట్లుగా సినిమాను విడుదల చేయడంలో మాత్రం విఫలం అవుతున్నారు వైవిఎస్.

బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో 'రేయ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయిధరమ్ తేజ్, సయామి ఖేర్, శ్రద్ధా దాస్ హీరో హీరోయిన్లు. సాయి ధరమ్ తేజ్ మెగా కుటుంబానికి చెందిన హీరో కావడంతో ఈ చిత్రం విడుదలకు ముందే మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా తరచూ విడుదల చేస్తున్న ప్రచార చిత్రాలు అదిరిపోయే విధంగా ఉండటం కూడా మరో కారణం. తాజాగా విడుదలైన ఈ చిత్రం పోస్టర్లో సాయి ధరమ్ తేజ్ లుక్ డిఫరెంటుగా, టెర్రిఫిక్‌గా ఉండటం ఆకట్టుకుంటోంది.

ఆడియో వేడుకలో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ...'నేను చిరంజీవి గారి దగ్గర నుండి కృషి, పట్టుదల.... నాగబాబు నుండి సహనం, నవ్వును....పవన్ కళ్యాణ్ దగ్గర నుండి క్రమశిక్షణ, నిబద్దత నేర్చుకున్నాను' అని తెలిపాడు. సాయి ధరమ్ తేజ్ ద్రవిడియన్ పర్సనాలిటీతో కరేబియన్ కుర్రాడిలా ఉంటాడు. సినిమాలో సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమా అందరికీ నచ్చుతుందనే పూర్తి నమ్మకం ఉంది అన్నారు దర్శకుడు వైవిఎస్.

English summary

 Sai Dharam Tej’s ‘Rey’ has postponed release date several times due to many reasons. we are hearing that once again that it is postponed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu