»   » సెట్లో నాగార్జునకి ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్

సెట్లో నాగార్జునకి ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సాధారణంగా స్టార్ హీరోల సినిమా షూటింగ్ లు అంటే ఏ విధమైన ఇబ్బంది ఉండదూ...అర్టిస్టులు పూర్తి సహకారం ఉంటుంది. అయితే రీసెంట్ గా 'భాయ్‌' చిత్రం హీరోయిన్ ... అందరూ సిద్దంగా ఉండగా షూటింగ్ ఎగ్గొట్టి ...నాగ్ కు ట్విస్ట్ ఇచ్చిందని ఫిల్మ్ నగర్ సమాచారం. నాగార్జున కల్పించుకున్నా ఆమె పట్టు వీడలేదని సమాచారం. ఇవాళ షూటింగ్‌ చేసేస్తే సరిపోతుంది. కాస్త కో ఆపరేట్‌ చేయమని బతిమాలితే ససేమిరా అందట. చివరికి నాగార్జున కల్పించుకుని చెప్పినా వినలేదట ఈ ఎన్నారై అందగత్తె.

ఇంతకు విషయం ఏమిటంటే...ఇప్పటికే షూటింగ్‌ మొత్తం కంప్లీట్‌ చేసుకున్న 'భాయ్‌' సినిమా ఒక్క పాట మాత్రమే బ్యాలెన్స్‌తో ఉండింది. ఇటీవల దాన్ని అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్‌లో భారీసెట్స్‌లో షూట్‌ చేయాలని దర్శకుడు భావించాడు. కొరియోగ్రాఫర్‌ రాజు సుందరం, హీరో నాగార్జున, డ్యాన్సర్లు... అందరూ రెడీగా ఉన్నారట. కానీ రిచా మాత్రం రాలేదు. ఎందకని ఎంక్వైరీ చేస్తే ... ఒంట్లో బాగలేదు, ఈ రోజు షూటింకి రాలేను అందట. దాంతో చిత్ర యూనిట్‌ అంతా షాక్ అయ్యింది.

దాంతో వేరే దారిలేక షూటింగ్‌ క్యాన్సిల్‌ చేయాల్సి వచ్చిందట. మరుసటి రోజు ఎలాగో అలాగ ఈ సినిమా షూటింగ్‌ని కంప్లీట్‌ చేశారు దర్శక నిర్మాతలు. ఒంట్లో బాగాలేకపోతే ఆ విషయం ముందే చెబితే సరిపోతుంది కదా! అలా అందరినీ వెయిట్‌ చేయిం ఇబ్బంది పెట్టడం ఎందుకని అంటున్నారు. ఈ చిత్రానికి నిర్మాత కూడా నాగార్జున కావటం విశేషం.

ఇక నాగార్జున హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న 'భాయ్' సినిమా షూటింగ్ పూర్తయింది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి వీరభద్రమ్ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ ఏడెకరాల్లో వేసిన రాజస్థాన్ సెట్‌లో 'అయ్ బాబోయ్ నీ చూపే చిలక ముక్కులా.. నా మనసుని కరా కరా కొరుకుతున్నాదే..' అనే పాటను నాగార్జున, రిచా గంగోపాధ్యాయ్, వంద మంది డాన్సర్లపై చిత్రీకరించడంతో చిత్రీకరణ మొత్తం పూర్తయింది. భాస్కరభట్ల రాసిన ఈ పాటకు రాజు సుందరం కొరియ్రోగఫీ సమకూర్చారు.

Nagarjuna

వీరభద్రమ్ మాట్లాడుతూ 'భాయ్' ఫస్ట్ లుక్‌కీ, టీజర్‌కీ గొప్ప స్పందన వచ్చిందనీ, ఇందులోని డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయనీ అన్నారు. "ప్రేక్షకుల, నాగార్జున గారి అభిమానుల అంచనాలకు తగ్గట్లుగానే చాలా పెద్ద రేంజిలో ఉంటుంది సినిమా. కచ్చితంగా నాకు హ్యాట్రిక్ సినిమా అవుతుంది'' అని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్. సాయిబాబు మాట్లాడుతూ "ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలో పాటల్ని విడుదల చేస్తాం. సినిమా రిలీజ్ డేట్‌ను కొద్ది రోజుల్లో ప్రకటిస్తాం'' అని తెలిపారు.

English summary
Nagarjuna’s Action Entertainer Bhai has completed its shoot today. The final song has been shot in Annapurna Studios. Richa Gangopadhyay is playing female lead in Bhai and Prasanna will be seen in an important role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu