»   » రీమేక్ రైట్స్ కోసం ఎన్టీఆర్,అల్లు అర్జున్ మధ్య పోటీ

రీమేక్ రైట్స్ కోసం ఎన్టీఆర్,అల్లు అర్జున్ మధ్య పోటీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఓ చిత్రం కోసం ఇద్దరు స్టార్ తెలుగు హీరోలు పోటీపడుతున్నారంటూ కన్నడ చిత్ర సీమలో వార్తలు వస్తున్నాయి. ఆ చిత్రం మరేదో కాదు రీసెంట్ గా ఓ వారం క్రితం విడుదులయిన ఉగ్రం చిత్రం. తమిళం నుంచి రీమేక్ రైట్స్ కు డిమాండ్ ఏర్పడిన ఈ చిత్రం కన్నడంలో రికార్డులు క్రియేట్ చేసే దిసగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. సినిమా చూడకుండానే టాక్ విని ఈ ఇద్దరు హీరోలు ఈ రీమేక్ రైట్స్ కోసం ఆసక్తి చూపిస్తున్నట్లు అక్కడ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Rift Between Jr NTR, Allu Arjun For Ugramm's Remake Rights

ఇక చిత్రం నిర్మాతలని కొందరు తెలుగు నిర్మాతలు కలిసి రైట్స్ కోసం అడిగారని తెలుస్తోంది. వారు చెప్పేదాన్ని బట్టి అది అల్లు అర్జున్ లేదా ఎన్టీఆర్ కోసం తీసుకోబోతున్నట్లు చెప్పుతున్నారు. అయితే ఆ నిర్మాతలు ఎవరు అనేది మాత్రం అక్కడ మీడియా ఎక్సపోజ్ చెయ్యటం లేదు. చిత్రంలో హై ఓల్టేజి యాక్షన్ సీన్స్ ఉండటంతో తెలుగుకి ఇది వర్కవుట్ అవుతుందని భావిస్తున్నట్లు చెప్తున్నారు.

Rift Between Jr NTR, Allu Arjun For Ugramm's Remake Rights2

మరో ప్రక్క ధనుష్ ఈ చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో చేయటానకి ఉత్సాహం చూపిస్తాడని చెప్తున్నారు. నార్త్ కర్ణాటక బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథలో నేరేషన్ హైలెట్ గా చెప్తున్నారు. మొదటి నుంచి చివరి వరకూ చాలా గ్రిప్పింగ్ గా సినిమా ని తీసాడని,యాక్షన్ ప్యాకెడ్ సీక్వెన్స్ లకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. రౌడీ రాజ్యంగా నడిచే ఓ ప్రాంతానికి తన స్నేహితుడుని కలవటం కోసం హీరో వస్తాడు. అక్కడ తన కళ్లెదురుగా ఓ అమ్మాయిని అక్కడ లోకల్ రౌడీలు రేప్ చేస్తూంటే చూస్తూ ఊరుకోలేకపోతాడు. దాంతో ఊరంతా సైలెంట్ గా ఉన్నా హీరో యాక్షన్ లోకి దిగి ఆ డాన్ ని చంపేసి,అక్కడ పరిస్దితులని తన చేతుల్లోకి తీసుకుని దారుణాలని అరికట్టాలని చూస్తాడు. ఆ క్రమంలో ఏం జరిగిందనే కథాంశం చుట్టూ సినిమా నడుస్తుంది.

English summary
Both NTR and Allu Arjun are reportedly bowled over by Ugramm's theatrical trailer, and expressed their wish to watch the movie. After they heard about the remake rights doing a huge buzz in Telugu film circles, even before watching the film, the duo have approached Ugramm movie makers to talk about the purchase of remake rights.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu