Just In
- just now
అయ్యో పాపం.. నితిన్ మీద ఎక్కబోయి కింద పడిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్!
- 26 min ago
మహేశ్‌కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
- 28 min ago
పొట్టి బట్టల్లో పిచ్చెక్కిస్తోంది.. నిహారికను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు!
- 1 hr ago
RRR నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. డేట్ కూడా ఫిక్స్?
Don't Miss!
- Sports
రెండు రోజుల్లోనే 22 టెస్టులు పూర్తి.. ఇంగ్లండ్ జట్టుదే ఆధిపత్యం!! భారత్ ఎన్నిసార్లంటే?
- News
Same Sex marriage: మోడీ సర్కార్ నిర్ణయంపై భగ్గుమంటోన్న స్వలింగ సంపర్కులు: తొక్కేశారంటూ
- Finance
గుడ్‌న్యూస్, 30,000 మందికి క్యాప్‌జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌కు అవకాశం
- Lifestyle
ఈ 4 రాశుల వారికి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉండవు... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షాకింగ్: త్రివిక్రమ్ తర్వాతి సినిమా తారక్‌తో కాదు.. రాజమౌళి ప్రకటన వల్లే ఈ నిర్ణయం.!
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. మాటల రచయితగా సినీ కెరీర్‌ను ఆరంభించిన ఆయన 'నువ్వే నువ్వే' సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ పలు విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ఇటీవల భారీ హిట్ కొట్టిన ఆయన.. తన తర్వాతి సినిమాను తారక్‌తో చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం.!

పవన్, మహేశ్‌ది మినహా అన్నీ అనుకున్నట్లే
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సినిమాలన్నీ దాదాపుగా విజయవంతం అయ్యాయి. ‘నువ్వే నువ్వే' మొదలుకొని ‘అతడు', ‘జల్సా', ‘జులాయి', ‘అత్తారింటికి దారేది', ‘సన్నాఫ్ సత్యమూర్తి', ‘అఆ', ‘అరవింద సమేత.. వీరరాఘవ', ‘అల.. వైకుంఠపురములో' సూపర్ హిట్లుగా నిలిచాయి. అయితే, పవన్‌తో చేసిన ‘అజ్ఞాతవాసి', మహేశ్‌తో తీసిన ‘ఖలేజా' మాత్రం నిరాశ పరిచాయి.

ఆ హీరోతో మూడోసారి కలిశాడు.. ఇండస్ట్రీ హిట్ కొట్టాడు
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సంక్రాంతికి అల్లు అర్జున్‌తో చేసిన ‘అల.. వైకుంఠపురములో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రీమియర్ షోల నుంచే హిట్ టాక్‌ను అందుకుంది. అలాగే, కలెక్షన్ల పరంగానూ అదరగొట్టేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే దాదాపు రూ. 150 కోట్ల షేర్ సాధించి, ‘బాహుబలి' తర్వాతి స్థానంలో నిలిచింది.

జూనియర్ ఎన్టీఆర్‌తో రెండోసారి.. త్రివిక్రమ్ ప్లాన్
‘అల.. వైకుంఠపురములో' హిట్ ఇచ్చిన ఉత్సాహంతో ఉన్నాడు త్రివిక్రమ్. ఈ క్రమంలోనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇందుకోసం ఓ పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్ ఉన్న కథను కూడా సిద్ధం చేసేశాడు. ఇప్పటికే ఈ కథను విన్న తారక్.. త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడు
త్రివిక్రమ్ తీసిన చాలా సినిమాల టైటిళ్లు ‘అ' అనే అక్షరంతోనే మొదలవుతాయి. ‘అజ్ఞాతవాసి' మినహా మిగతావన్నీ సూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే తారక్‌తో చేసే సినిమాకు సైతం అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ.. ‘అయిననూ పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. రాధాకృష్ణ నిర్మించే ఈ మూవీలో రష్మిక హీరోయిన్ అని సమాచారం.


త్రివిక్రమ్ తర్వాతి సినిమా తారక్‌తో కాదు
తారక్.. త్రివిక్రమ్ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతుందని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో.. ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం... గురూజీ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్‌తో చేయడం లేదట. అతడితో చేయాల్సిన సినిమాను పక్కన పెట్టేసి.. ఓ యంగ్ హీరోతో ఆయన సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

రాజమౌళి ప్రకటన వల్లే ఈ నిర్ణయం.!
త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం.. దర్శకధీరుడు రాజమౌళి టీమ్ చేసిన ప్రకటనే అని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న ‘RRR' విడుదలను వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేశారు. అంటే అప్పటి వరకు ఎన్టీఆర్ మరో సినిమా చేయడట. దీంతో అన్ని రోజులు ఖాళీగా ఉండడం ఇష్టం లేని త్రివిక్రమ్ ఓ మీడియం రేంజ్ సినిమా చేయబోతున్నాడని తెలిసింది.