Just In
- 15 min ago
Naandhi Collections.. దుమ్ములేపిన అల్లరి నరేష్.. ఇప్పటి వరకు వచ్చిన లాభమెంతంటే?
- 36 min ago
తల్లి కాబోతోన్న ప్రభాస్ హీరోయిన్.. మొత్తానికి అలా గుడ్ న్యూస్ గుట్టు విప్పేసింది!
- 1 hr ago
నా ఫస్ట్ లవ్ నా హార్ట్ బ్రేక్.. అన్ని విషయాలు ఒకరికే తెలుసు.. గుట్టువిప్పిన సమంత
- 1 hr ago
Check 2nd day collections: నితిన్ మూవీ పరిస్థితి ఏమిటి? లాభాల్లోకి రావాలంటే..
Don't Miss!
- Sports
పిచ్‌ను నిదించడం సరికాదు: ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్
- News
Illegal affair: పెళ్లానికి పులిహోరా, ఉంచుకున్న దానికి...... ?, భార్య బంగారం, డబ్బు !
- Finance
అమెరికాకు భారీగా అప్పులు, చైనా, జపాన్ నుండే ఎక్కువ: భారత్‌కు ఎంత చెల్లించాలంటే
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అలియా దెబ్బకు ఆ ఇద్దరితోపాటు రాజమౌళి గిలగిల.. RRR వాయిదా వెనుక క్రేజీగా..

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR చిత్రం సెట్లో ఉండగానే అనేక ఆసక్తికరమైన వార్తలకు, గాసిప్స్‌కు ఫుల్లుగా వేదిక అవుతున్నది. మీడియాలో తిరుగుతున్న వార్తలకు తగినట్టుగానే సినిమా రిలీజ్ వాయిదా పడటంతో గాలి వార్తలకు బలం చేకూరుతున్నాయి. అయితే తాజాగా RRR రిలీజ్ వాయిదా వెనుక పలు కారణాలు, వాటి వల్ల ఎన్టీఆర్, రాంచరణ్ పడుతున్న ఇబ్బంది వార్తలు ఫిలింనగర్ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకు ఆ కారణాలు ఏమిటంటే..

RRR రిలీజ్ డేట్ వాయిదా పడటానికి
RRR చిత్రం రిలీజ్ వాయిదా పడటం వెనుక ఓ ప్రధాన కారణం ఆలియాభట్ డేట్ల సమస్య. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఇతర ప్రాజెక్టులు, బాయ్‌ఫ్రెండ్ రణ్‌బీర్‌తో టూర్లు కొట్టడం వల్ల RRR మూవీ షూటింగ్‌కు హాజరుకాలేకపోవడంతో పలు మార్లు షూటింగ్‌కు అంతరాయం కలిగిందనే మాట చక్కర్లు కొడుతున్నది. గతేడాది జనవరి తర్వాత తన ప్రియుడు రణ్‌బీర్ కపూర్ తండ్రి, క్యాన్సర్‌తో బాధపడుతున్న రిషి కపూర్‌ను పరామర్శించడానికి చెప్పకుండా వెళ్లడం వల్ల RRR షూటింగ్‌కు భారీగా అంతరాయం కలిగిందని ఇన్‌సైడర్ టాక్. ఆ కారణం ఇప్పటికీ డేట్ల సమస్యకు కారణమైందనే మాట వినిపిస్తున్నది.

అలియా డేట్ల అడ్జస్ట్‌మెంట్
అలియాభట్ డేట్ల సమస్య వల్ల ఇతర నటీనటులకు సంబంధించిన డేట్ల సర్దుబాటు కూడా ఇబ్బందిగా మారినట్టు సమాచారం. ఆ క్రమంలో ఇతర నటీనటుల డేట్లను అడ్జస్ట్ చేసే క్రమంలో షూట్ పలు మార్లు వాయిదా పడినట్టు సినీ వర్గాలు వెల్లడిస్తున్నారు. ఈ కారణంగానే రిలీజ్ డేట్‌ను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో జక్కన్న ఇక చేసేది ఏమీ లేక సంక్రాంతి బరిలో దూకినట్టు సమాచారం.

ఎన్టీఆర్, రాంచరణ్‌కు ఇబ్బందిగా
అలియా భట్ డేట్ల సర్దుబాటు విషయం ఎన్టీఆర్, రాంచరణ్‌కు కూడా సమస్యగా మారిందని, ఆమె డేట్లకు అనుగుణంగా ఇద్దరు స్టార్ హీరోలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి తలెత్తిదంట. ప్రస్తుతం అలియా భట్ ఎప్పుడు షూట్‌కు వస్తుందనే విషయం గురించి ఇద్దరు స్టార్ హీరోలు ఎదురు చూస్తున్నారట. ఆలియా రాగానే కీలక సన్నివేశాలను చిత్రీకరించే పనిలో చిత్ర యూనిట్ ఉంది.

ఇక గ్రాఫిక్ పనులకు కూడా టైమ్ లేకపోవడం
వాస్తవానికి RRR చిత్రం రిలీజ్ జూలై 30, 2020న రిలీజ్ కావాల్సింది. కానీ గ్రాఫిక్స్ పనులు పూర్తయ్యే అవకాశం లేకపోవడం వల్ల రిలీజ్ డేట్‌ను మార్చి జనవరి 8వ తేదీన రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. సంక్రాంతి సెలవుల్లో భారీ వసూళ్లను రాబట్టే ప్రణాళికను రాజమౌళి సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. హిందీలో కూడా భారీగా ప్రమోట్ చేయడానికి కూడా సమయం కావాల్సి రావడంతో ఈ మేరకు రిలీజ్ డేట్లు కూడా మార్చాల్సి వచ్చిందని సినీ వర్గాలు చెప్పుకొంటున్నారు.