twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ ‘బాద్ షా’ శాటిలైట్స్ రైట్స్‌పై పుకారు నిజమేనా?

    By Bojja Kumar
    |

    Baadshah
    హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ 'బాద్ షా' చిత్రం పలు రికార్డులను నెలకొల్పుతూ ముందుకు సాగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈచిత్రం శాటిలైట్ రైట్స్ విషయంలో కూడా భారీ రేటు దక్కిందనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ థర్డ్ పార్టీ వారు రూ. 7 కోట్లకు కొనుగులో చేసారని, వారు జెమినీ టీవీకి సంబంధించిన వారు కావొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై నిజా నిజాలు తేలాల్సి ఉంది.

    జూ ఎన్టీఆ‌ర్ కు ఫ్యామిలీ ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కు తోడు, ఢీ, రెడీ, దూకుడు లాంటి హిట్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల సినిమా కావడంతో ఈ చిత్రానికి బుల్లితెర మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. ఇద్దరి కాంబినేషన్ వల్లనే ఈ రేంజిలో రేటు రావడానికి కారణమైందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని, ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

    'బాద్ షా' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    The Rumor is that....Baadshah movie Satellite rights have been sold to a third party for Rs 7 crs and the third party tends to be one of the channels own company.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X