»   » పంక్షన్ వాయిదాకి కారణం పవన్ కళ్యాణ్?

పంక్షన్ వాయిదాకి కారణం పవన్ కళ్యాణ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సన్నాఫ్ సత్యమూర్తి. ఈ సినిమా గత గురువారం రిలీజ్ అయ్యి డివైడ్ టాక్ తెచ్చుకున్నా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టుకుంది. మొదటి వారంలోనే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 35 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా. ఈ సినిమాని ఇంత పెద్ద విజయం చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ చెప్పుకోవడానికి ఈ చిత్ర టీం గ్రాండ్ గా థాంక్స్ మీట్ ని చేయాలనుకున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ పంక్షన్ ని ఈ నెల 18న హైదరాబాద్ లోని శిల్పకళ వేదికలో జరపాలనుకున్నారు. అయితే వాడిదా పడిందని సమాచారం. దానికి కారణం ..పవన్ కళ్యాణ్ గెస్ట్ గా అనుకున్నారని, ఆయన కోసమే తేదీని మార్చనున్నారని చెప్పుకుంటున్నారు. అయితే మరో ప్రక్క వేదిక పరంగా చిన్న సమస్య రావడతో ఈ థాంక్స్ మీట్ ని వాయిదా వేసారని వినిపిస్తోంది.


ఏదమైనా త్వరలోనే సరికొత్త తేదీ థాంక్స్ మీట్ కి ,మరియు వేదికని తెలియజేయనున్నారు. ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ వేడుకకి మెగా ఫ్యామిలీ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.


S/O Satyamurthy’s Thank you meet postponed

మార్నింగ్ షో నుంచి డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మల్టిఫ్లెక్స్ లు , ఎ సెంటర్లలలో హౌస్ ఫుల్స్ తో రన్ అవుతోంది. అయితే బి,సి సెంటర్లలలో మాత్రం డ్రాప్ అయ్యిందని ట్రేడ్ వర్గాల సమాచారం. మరి కేరళ భాక్సాఫీస్ వద్ద పరిస్దితి ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అక్కడ నిత్యామీనన్ ఉండటం కూడా ప్లస్ అవుతుంది.


అల్లు అర్జున్ సినిమా అంటేనే అంచనాలు పెరిగిపోతాయి. అలాంటిది కుటుంబ ప్రేక్షకులను తనదైన సెంటిమెంట్, భావోద్వేగాలు, ఫన్ తో ఆకట్టుకునే త్రివిక్రమ్ జత కలిస్తే ఇంకేముంది. జులాయి ని మించిపోతుంది. ఇప్పుడు అందరి అంచనా ఇదే. దానికి తోడు విభిన్నమైన టైటిల్, అత్తారింటికి దారేది వంటి మెగా హిట్ తర్వాత త్రివిక్రమ్ నుంచి, రేసు గుర్రం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ వస్తున్న చిత్రం కావటం మరింతగా అంచనాలు పెంచేసింది. దాంతో టాక్ తో సంభందం లేకుండా ముందుకు వెళ్తోంది.


విలువైన మంచిమాటలే ఆస్తి అనే అంశాన్ని ఈ చిత్రంలో ప్రధానమైన అంశంగా తీసుకుని దర్శకుడు కథను రూపొందించారు. 'నాన్న నాకేమిచ్చాడు' అంటూ లెక్కలేసుకొంటుంటారు తనయులు. కార్లు, బంగళాలూ, వూరవతల గెస్ట్‌ హౌస్‌లూ ఇవన్నీ కాగితాలపైనే కనిపిస్తాయి. కానీ కంటికి కనిపించని ఆస్తులు ఆయన చాలానే ఇస్తాడు. బతుకు పోరాటం నేర్పించేది నాన్నే. అంతెందుకు ఈ జీవితాన్ని ఇచ్చిందే నాన్న. విరాజ్‌ ఆనంద్‌ నమ్మిందీ అదే. సత్యమూర్తి గారబ్బాయి విరాజ్‌ ఆనంద్‌. తండ్రంటే దస్తావేజులపై కనిపించే సంతకం కాదు.. నా జీవితం అని నమ్మిన విరాజ్‌.. ఆ తండ్రి కోసం ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.


S/O Satyamurthy’s Thank you meet postponed

చిత్రం గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ... ఇటీవల వచ్చిన 'ఇద్దరమ్మాయిలతో...' సినిమాలో రాక్ గిటార్ ప్లేయర్‌గా చేశాను. 'రేసు గుర్రం'లో మధ్యతరగతి అబ్బాయిగా చేశాను. వాటితో పోలిస్తే, 'సన్ ఆఫ్ సత్యమూర్తి'లో నాది కొంత డిగ్నిటీ ఎక్కువున్న పాత్ర. హుందాతనం నిండిన ఆ పాత్రలో కూడా వస్త్రధారణలో ఒక స్టైల్ తెచ్చేందుకు ప్రయత్నించాం. పైగా, నేనెప్పుడూ ఒకటికి నాలుగు అలంకరణలతో నిండిన వస్త్రధారణ చేస్తుంటా. కానీ, పాటలు వదిలేస్తే, ఈ సినిమాలో కావాలనే అవన్నీ వదిలించుకొని, సింపుల్‌గా, సింగిల్ పీస్‌లో ఉండేలా చూశా. దాంతో, నేను కొత్తగా కనిపిస్తాను అన్నారు.


త్రివిక్రమ్ సినిమాలంటే పంచ్ డైలాగులు ఉంటాయని..సగటు ప్రేక్షకుడ్ని కూడా అలరిస్తాయని అందరికి తెలిసిన విషయమే. ఆయన మాటల్లోని పంచ్‌లు ప్రతి అభిమానికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. అందుకే ఆయన మాటల మాంత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమా ఏదీ చూసిన తన డైలాగుల మార్క్ కనబడుతుంది. దానికి తగ్గట్టుగా త్రివిక్రమ్ డైలాగ్స్‌ ‘సత్యమూర్తి'కి సరికొత్త లుక్‌ని తీసుకొచ్చాడని చెబుతున్నారు.

English summary
It seems that S/O Satyamurthy Thank You meet date has been postponed to new date due to problem in venue and pawan kalyan.
Please Wait while comments are loading...