»   »  మెగాభిమానుల నిరసన.. వెనక్కి తగ్గాడు

మెగాభిమానుల నిరసన.. వెనక్కి తగ్గాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాయి ధరమ్ తేజ త్వరలో తను దర్శకుడు గోపీచంద్ మలినేని తో చేయబోయే చిత్రానికి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ని ఫైనలైజ్ చేయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై మెగాభిమానులు మండిపడ్డారు.

సోషల్ మీడియాలో వారు ఈ టైటిల్ ని పెట్టుకుంటే రామ్ చరణ్ సినిమాకు పెట్టుకోవాలి కానీ సాయి ధరమ్ తేజకు పెట్టడమేంటి అని నిరసనతో పోస్ట్ లో పెట్టడం మొదలెట్టారు. ఈ నేపధ్యంలో ఈ టైటిల్ విషయమై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అసలు ఈ టైటిల్ నే తాము కన్సిరిడేట్ చేయలేదని చెప్తున్నట్లు సమాచారం.

 Sai Dharam’s film not titled as Gang Leader

నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు జాయింట్ వెంచర్ క్రింద రూపొందే ఈ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ ని హీరోయిన్ గా ఎంపిక చేసారు రామ్ చరణ్ తో తని ఒరువన్ రీమేక్ చేస్తున్న ఈమె ఈ సినిమాని రీసెంట్ గానే ఓకే చేసినట్లు సమాచరం.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ..సుప్రీమ్, తిక్క చిత్రలలో బిజీగా ఉన్నారు. త్వరలో ఈ కొత్త చిత్రం పట్టాలు ఎక్కనుంది. రామ్ తో చేసిన పండుగ చేస్కో చిత్రం యావరేజ్ అవటంతో గ్యాప్ వచ్చిన గోపీచంద్ మలినేని...పెద్ద హీరోలు డేట్స్ దొరకటం కష్టంగా ఉండటంతో ..ఇప్పుడిప్పుడే మాస్ హీరోగా ఎదుగుతున్న సాయి ధరమ్ తేజ తో ముందుకు వెళ్తున్నారు.

English summary
Sai Dharam Teja’s upcoming film will not have its title as Gang Leader.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu