twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా హీరో సినిమా ఓటీటీ రిలీజ్.. ఫ్రీ కాదట, మళ్ళీ అంత డబ్బులు పెట్టాలంటే కష్టమే..

    |

    కరోనా వైరస్ వచ్చి ఒక్కసారిగా ప్రపంచ సినిమా పరిశ్రమలను గట్టి దెబ్బె కొట్టింది. ఒక్క ఇండియాలోనే ఈ ఆరు నెలల్లో వేల కోట్ల బిజినెస్ కి గండి పడింది. చరిత్రలోనే మొదటిసారి వెండితెర నెలలు తరబడి మూగ బోయింది. ఇక నిర్మాతలు సినిమాలను డిజిటల్ వరల్డ్ లోకి తీసుకురాలేక తప్పలేదు. ఇప్పటివరకు ఓటీటీలో వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకున్నది లేదు. ఇక నెక్స్ట్ అందరి చూపు మెగా హీరో మూవీపైనే ఉంది. అదే సోలో బ్రతుకే సో బెటర్.

    Recommended Video

    Mega Hero 'Solo Brathuke So Better' Movie Releasing In OTT
    సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా..

    సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా..

    సాయి ధరమ్ తేజ్ మొత్తానికి ప్రతి రోజు పండగే సినిమాతో ఫామ్ లోకి వచ్చేశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకోవడంతో నెక్స్ట్ కూడా అదే తరహాలో హిట్స్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. కొత్త దర్శకుడు సుబ్బు డైరెక్షన్ లో చేసిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడో సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా థియేటర్ రిలీజ్ ని మిస్సవుతోంది.

    మంచి రేటుకే అమ్మేశారు..కానీ

    మంచి రేటుకే అమ్మేశారు..కానీ

    మొత్తానికి నిర్మాత బివిఎస్ఏన్.ప్రసాద్ ఒక మంచి రేటుకు ఓటీటీ సంస్థ జీ5కి అమ్మేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో బయ్యర్ సెల్లర్ మధ్య ఒక ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఓటీటీ రిలీజ్ అంటే ఆల్ రెడీ స‌బ్‌స్క్రైబ్ అయ్యి ఉంటారు కాబట్టి ఫ్రీగానే చూసే అవకాశం ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో కొందరు ఓటీటీలోనే మళ్ళీ పే ప‌ర్ వ్యూ పద్ధతిని అమలులోకి తీసుకువస్తున్నారు.

    సినిమాకు రెండు సార్లు డబ్బులు పెట్టాలంటే..

    సినిమాకు రెండు సార్లు డబ్బులు పెట్టాలంటే..

    స‌బ్‌స్క్రైబ్ పేమెంట్ తో పాటు మళ్ళీ పే ప‌ర్ వ్యూ అంటే సాదారణ ఆడియెన్స్ కి చాలా కష్టంగా మారుతుంది. కరోనా కష్ట కాలంలో రూపాయి రూపాయి లెక్కేసుకొని ఖర్చు చేసుకునేవారు సినిమాకు రెండు సార్లు డబ్బులు పెట్టడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు. అయితే ఇప్పటికే కొంతమంది ఈ ఫార్ములాను వాడారు. వాళ్లకు ఎంతవరకు లాభాలు వచ్చాయో తెలియదు గాని ఇది రిస్క్ తో కూడుకున్న పని అని తెలిసినప్పటికీ కొందరు నిర్మాతలు తగ్గడం లేదు.

    పే పర్ వ్యూ.. 299రూపాయలా?

    పే పర్ వ్యూ.. 299రూపాయలా?

    ఇక సోలో బ్రతుకే సో బెటర్ సినిమాకు కూడా అదే తరహాలో డబ్బులు వసూలు చేయాలని మేకర్స్ ప్లాన్ గట్టిగానే వేశారు. సాధారణంగా పే పర్ వ్యూ వ్యవహారంలో 199 నుంచి 299రూపాయల వరకు ఛార్జ్ చేసే అవకాశం ఉందట. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. సోలో బ్రతుకే సో బెటర్ రిలీజ్ డేట్ పై ఈ నెలలోనే క్లారిటీ రానున్నట్లు సమాచారం.

    English summary
    Sai Dharam Tej, who was struggling with back to back flops in his career made his comeback with the film Chitralahari. Then, he followed it up with his biggest hit Pratiroju Pandage. Since then, he has been carefully looking after his career and is signing some good films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X