»   » ఒకే సినిమా.. ఇద్దరూ హీరోలు: సల్మాన్ , చరణ్ కాంబినేషన్

ఒకే సినిమా.. ఇద్దరూ హీరోలు: సల్మాన్ , చరణ్ కాంబినేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: రామ్ చరణ్ ఆ మధ్యన జంజీర్ రీమేక్ చేసి బాలీవుడ్ భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన మరోసారి తన ప్రయత్నం మొదలెట్టినట్లు తెలుస్తో్ంది. ఈ సారి సల్మాన్ అండతో ఆయన భాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ కలిసి ఓ యాక్షన్ చిత్రంలో చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్టు విషయమై సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ మధ్య చర్చలు జరిగాయని చెప్తున్నారు. రామ్ చరణ్ కు ఈ ఆఫర్ ని సల్మాన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ చాలా ఆనందంతో వెంటనే ఓకే చేసినట్లు సమాచారం. ఇద్దరివీ టైలర్ మేడ్ రోల్స్ అని, వచ్చే సంవత్సరం ఆ చిత్రం మెటీరియలైజ్ చేద్దామని అన్నట్లు చెప్పుకుంటున్నారు.

ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ గా ప్రజెంట్ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న సల్మాన్ ఖాన్ కు టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పబోతున్నాడు. సల్మాన్ చేస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమా కోసం ఈ క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేస్తున్నారు చిత్రయూనిట్.

Salman Khan offers Ram Charan two-hero project with him

'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమాను హిందీతో పాటు ఒకేసారి తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది చిత్ర నిర్మాణ సంస్ధ రాజశ్రీ ప్రొడక్షన్స్, అయితే తెలుగు వర్షన్ లో సల్మాన్ పాత్రకు ఓ స్టార్ హీరోతో డబ్బింగ్ చెప్పించాలని భావించిన యూనిట్ సభ్యులు సల్మాన్ తో సన్నిహిత సంబందాలు ఉన్న మెగా ఫ్యామిలీ హీరో అయితే కరెక్ట్ అని భావించారట.

అందుకే సల్మాన్ ఖాన్ స్వయంగా చెర్రీకి ఫోన్ చేసి అడగటంతో చరణ్ వెంటనే ఒప్పేసుకున్నాడన్న టాక్ వినిపిస్తుంది. గతంలో సల్మాన్ హీరోగా తెరకెక్కిన 'మైనే ప్యార్ కియా', 'హమ్ ఆప్కే హై కౌన్' సినిమాలు తెలుగులో డబ్ అయి మంచి విజయాలు సాదించాయి.

ఈ రెండు సినిమాలు తెలుగులో సక్సెస్ చేసిన రాజశ్రీ సంస్థ మరోసారి సల్మాన్ హీరోగా అదే మ్యాజిక్ ను రిపీట్ చేయాలని భావిస్తోంది. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా సల్మాన్ సినిమాకు చరణ్ డబ్బింగ్ అన్న వార్త మాత్రం ఫిలిం నగర్ లో గట్టిగానే వినిపిస్తుంది.

English summary
Salman has promised to work with Ram Charan in a two-hero project featuring them both in tailor-made roles. The project is likely to go on floors next year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu