»   » ఈ రెండు రీమేక్ లకు సల్మాన్ ఖాన్ సై

ఈ రెండు రీమేక్ లకు సల్మాన్ ఖాన్ సై

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఏదైనా భాషలో ఓ చిత్రం హిట్టైందంటే సల్మాన్ ఖాన్ దాని రైట్స్ పై కన్నేస్తూంటారు. ఇప్పుడు అలాగే ఆయన మహేష్ సూపర్ హిట్ 'శ్రీమంతుడు' ని రీమేక్ చేయటానికి ఆసక్తి చూపెడుతున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఆయన చిత్రాన్ని నిర్మించాలని కూడా అనుకుంటున్నట్లు చెప్తున్నారు. మహేష్ బాబు గతంలో పోకిరి ని వాంటెడ్ గా రీమేక్ చేసి హిట్ కొట్టి అప్పటికి ఫ్లాఫుల్లో ఉన్న సల్మాన్ ఖాన్ ఫామ్ లోకి వచ్చారు. దాంతో ఈ సినిమాపై ఉత్సాహం చూపుతున్నట్లు చెప్తున్నారు.

Salman to remake Srimanthudu, 'Thani Oruvan'?

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


శ్రీమంతుడు కథేమిటంటే...


గోల్డెన్ స్పూన్ తో పుట్టిన హర్ష వర్ధన్ (మహేష్) చదువుపూర్తి చేసుకుని బిజినెస్ చూసుకోవాలని తండ్రి రవికాంత్(జగపతిబాబు) ఆశపడతాడు. అయితే తనకు అన్నీ ఉన్నా తనకు అనుకున్న సంతోషం దక్కలేదని ఇంకేదో కావాలని వెతుకుతూంటాడు హర్ష. ఆ క్రమంలో అతనికి చారుశీల(శృతిహాసన్) పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో పడి ప్రపోజ్ చేస్తే...ఆమె హర్ష...ఫలానా రవికాంత్ కొడుకు అని తెలుసుకుని రిజెక్టు చేస్తుంది. దానికి కారణం...నీకు నీ సొంత ఊరు కూడా తెలియదు..మీ ఊరుకి ఏమీ చెయ్యలేదు అంటుంది.


అప్పుడు తన సొంత ఊరు దేవరకోట అని తెలుసుకుని హర్ష అక్కడి వెళ్లతాడు. ఆ ఊరిలో చారుశీల తండ్రి నారాయణరావు(రాజేంద్రప్రసాద్)తో కలిసి ఆ ఊరుని బాగుచేయటం మొదలెడతాడు. అయితే అక్కడ లోకల్ గా శశి(సంపత్)అనే గూండా ఉండి అడ్డుపడతాడు. అక్కడ నుంచి కథ మరో మలుపు తీసుకుంటుంది. అంతేకాకుండా హర్ష కు ఇంకో షాక్ అయ్యే విషయం తెలుస్తుంది...ఇంతకీ హర్ష తెలుసుకున్న ఆ విషయం ఏమిటి...ఇంతకీ గ్రామంలో ఏం చేసాడు...చివరకు హర్ష ఆమె ప్రేమను ఎలా సాధించాడు. ముఖేష్ రుషి పాత్ర కథలో ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


Salman to remake Srimanthudu, 'Thani Oruvan'?

అలాగే మరో రీమేక్ పైనా కూడా సల్మాన్ ...


మొత్తం హిందీ, కన్నడ, తెలుగు చిత్ర సీమలను తన వైపు తిప్పుకున్న ఆ చిత్రం పేరు 'తని ఒరువన్'. 'దృశ్యం' తర్వాత మళ్లీ ఓ హాట్ కేక్. మలయాళ 'దృశ్యం' ఇప్పటికే అయిదు భాషల్లో రీమేక్ అయి విజయం సాధించింది. మళ్లీ ఆ సినిమా తర్వాత 'తని ఒరువన్' హాట్ కేక్‌లా మారింది. అన్ని భాషల్లోనూ ఈ సినిమా రీమేక్ చేయాలని హేమాహేమీలు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు నుంచి రామ్‌చరణ్, మహేశ్‌బాబు, హిందీ నుంచి సల్మాన్‌ఖాన్, కన్నడంలో పునీత్ రాజ్‌కుమార్‌ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక హీరోయిన్ జెనీలియాకు ఈ సినిమా తెగ నచ్చేసి మరాఠీ వెర్షన్‌లో హీరోయిన్‌గా నటించడానికి సై అన్నారు. బెంగాలీ వెర్షన్ రీమేక్ హక్కుల గురించి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టేసింది.


బాలీవుడ్ విషయానికి వస్తే, సల్మాన్ ఖాన్ ఈ సినిమా చూడలేదు కానీ, ఆయన ప్రొడక్షన్ యూనిట్ ఇప్పటికే ఈ సినిమా చూసి, రీమేక్ రైట్స్ తీసుకోవటం కోసం డిస్కషన్స్ మొదలుపెట్టారని చెప్తున్నారు.


ఆగస్టు 28... శుక్రవారం. తమిళనాట ఓ సినిమా రిలీజైంది. ఎవ్వరికీ పెద్ద అంచనాల్లేవ్. హీరో 'జయం' రవి. దర్శకుడు ఎం.రాజా. వాళ్లిద్దరూ అన్నదమ్ములు. హీరోయిన్ నయనతార. మార్నింగ్ షో చూసి ఆడియన్స్ షాక్. స్టోరీ, టేకింగ్ చూసి థ్రిల్లైపోయారు. ఇక అక్కణ్నుంచీ థియేటర్లన్నీ హౌస్‌ఫుల్. చూసిన వాళ్లు, మళ్లీ మళ్లీ చూస్తున్నారు. చూడనివాళ్లు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు.


Salman to remake Srimanthudu, 'Thani Oruvan'?

కథేంటి...


మిత్రన్ ('జయం' రవి), అతని స్నేహితులు ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్స్. డ్యూటీలో చేరక ముందే తమ కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తూంటారు. మిత్రన్ ప్రేయసి మహిమ (నయనతార) కూడా వాళ్లతో చేతులు కలుపుతుంది. ఈ క్రమంలోనే ఓ సామాజిక కార్యకర్త వీళ్ల కళ్లముందే హత్యకు గురవుతాడు. ఇలాగే వరుస హత్యలు చోటుచేసుకుంటాయి. ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత హత్యలుగా వాళ్లు గుర్తిస్తారు. ఫైనల్‌గా ఇదంతా ఫేమస్ సైంటిస్ట్ సిద్ధార్థ్(అరవింద స్వామి) చేస్తున్నాడని తెలుసుకుంటారు. చివరకు సిద్ధార్థ్ధ్‌ను వాళ్లు ఎలా ఎదిరించారన్నది మిగిలిన కథాంశం. తమిళంలో చివరి 'నెగటివ్' సినిమా! ఈ సినిమా ఇప్పటికే వసూళ్లు కొల్లగొడుతూంటే, మరో రూపంలో ఇది చరిత్రలో నిలిచిపోనుంది. తమిళంలో 'నెగటివ్' వాడిన చివరి సినిమా ఇదే.

English summary
Salman Khan recently watched Srimanthudu, 'Thani Oruvan' films and liked it completely.
Please Wait while comments are loading...