»   » పాపం సమంత....నిర్మాత కొడుకుల మధ్య ఇరుక్కుంది!

పాపం సమంత....నిర్మాత కొడుకుల మధ్య ఇరుక్కుంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం టాలీవుడ్లో నెం.1 స్టార్ హీరోయిన్ ఎవరంటే ముందుగా అందరూ చెప్పే పేరు సమంత. సమంతతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం పోటీ పడే పరిస్థితి. అలాంటి సమంత ఓ నిర్మాత కొడుకుల కోసం తన స్టార్ ఇమేజ్‌ను పనంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ సమంత హీరోయిన్‌గా వివి వినాయక్ దర్శకత్వంలో పొడక్షన్ నెం.1గా ఓ సినిమా ఆ మధ్య ప్రారంభోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభోత్సవం గ్రాండ్‌గా జరిగింది కానీ ఇప్పటి వరకు సినిమా పట్టాలెక్కలేదు.

కథ విషయంలో బెల్లంకొండ, వివి వినాయక్ మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడం వల్లనే సినిమా ఆగి పోయింది. ఈ కారణంగా సమంత డేట్స్ వేస్ట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. షూటింగ్ జరుగకపోతే సమంతకు ఇచ్చే రెమ్యూనరేషన్ డబ్బులు నష్టపోతామని గ్రహించిన బెల్లంకొండ సురేష్.....పెద్ద కొడుకు శ్రీనివాస్ స్థానంలో, చిన్న కొడుకు బెల్లంకొండ సాయి హీరోగా పెట్టి హడావుడిగా సినిమా ప్రారంభించినట్లు సమాచారం.

బెల్లంకొండకు సురేష్‌కు ముందుగానే డేట్స్ ఇచ్చి కమిటైన కారణంగా....సమంత ఇష్టం లేకకున్నా బెల్లంకొండ సాయి సరసన చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ రోజే షూటింగ్ ప్రారంభమై అన్నపూర్ణ స్టూడియోలో ఓ పాట కూడా చిత్రీకరించారట. ఈ సినిమా యాక్షన్ మరియు డ్యాన్సులను మేళవించిన ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని తెలుస్తోంది. వీలైనంత తక్కువ ఖర్చుతో సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయాలని బెల్లంకొండ ప్రయత్నిస్తున్నారని, ఈ సినిమా ఖర్చులో ఎక్కువ శాతం సమంతకు ఇచ్చే రెమ్యూనరేషనే అని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
Bellamkonda Sai, son of producer Bellamkonda Suresh, is going to make his debut as a hero very soon. The movie is being directed by V.V. Vinayak and Samantha is the heroine in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu