»   » సమంతాకి అనారోగ్యం...ఎన్టీఆర్ ట్రబుల్

సమంతాకి అనారోగ్యం...ఎన్టీఆర్ ట్రబుల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న 'బృందావనం' చిత్రంలో సమంత హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. కేరళలలో రెగ్యులర్ షూటింగ్ జరుగుతూండగా హీరోయిన్ సమంత జ్వరం వచ్చి ఫెయింట్ అయి పడిపోయింది. డయాగ్నోస్ చేసిన డాక్టర్స్ ఆమెకు ఛికెన్ ఫాక్స్ అని తేల్చారు. దాంతో ఆమెకు రెస్ట్ ఇచ్చిన యూనిట్ హైదరాబాద్ వచ్చి ఆమె లేని మిగతా సన్నివేశాలు తీస్తున్నారు. ఇక ఆమె రికవరీ అయిన తర్వాత ఆమె కాంబినేషన్లో వచ్చే సీన్లను చిత్రీకరించనున్నారని సమాచారం. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది. మున్నా ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఏ మాయ చేసావే చిత్రంతో తెలుగునాట స్టార్ హీరోయిన్ గా మారింది. మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్ చిత్రంలోనూ చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu