»   » బాత్రూం సీన్....త్రివిక్రమ్‌కు సమంత విచిత్రమైన కండీషన్!

బాత్రూం సీన్....త్రివిక్రమ్‌కు సమంత విచిత్రమైన కండీషన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత జంటగా ‘అ..ఆ' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. సినిమా స్క్రిప్టులో భాగంగా సమంతపై ఓ బాత్రూం సీన్ ప్లాన్ చేసారు. ఇలాంటి సీన్లు స్టార్ హోటల్స్, లేదా అందుకు అనుగుణంగా ఉన్న రూమ్స్ లో తెరకెక్కిస్తారు. అయితే సమంత ఇలాంటి చోట్ల తాను చేయననంటూ విచిత్రమైన కండీషన్ పెట్టిందట.

Also Read: సెక్సీ సమంత ఇలా చేయడం ఆశ్చర్యమే!


హోటల్స్, రూమ్స్ వద్ద ఇలాంటి సీన్లు చేయడం ఇన్ సెక్యూర్ గా ఉంటుందనే ఉద్దేశ్యంతో సమంత అలా అనేసిందట. దీంతో నిర్మాతలు హైదరాబాద్ లోని స్టూడియోలోనే ఈ సీన్ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా బాత్ టబ్ సెట్ వేసారట. అసలే స్టార్ హీరోయిన్...ఆమెతో అనవసరంగా గొడవ ఎందుకులే అని దర్శకుడు త్రివిక్రమ్ తో పాటు, నిర్మాతలు ఈ విషయంలో సర్దుకు పోకతప్పలేదు.


Also Read: అయినా ఎలా ఆశపడ్డారు?: దేవయాని భర్తకు, సమంత నో చెప్పింది


Samantha shocking conditions to A..Aa. makers

‘అ...ఆ' చిత్రం ట్యాగ్ లైన్.... అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హీరో నితిన్ తొలిసారిగా నటిస్తుండగా సూర్యదేవర రాధాకృష్ణ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను త్రివిక్రమ్ స్వయంగా చూస్తున్నారు.


సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సమంత నటిస్తుండగా.... మరో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. త్రివిక్రమ్ గత సినిమా ‘అత్తారింటికి దారేది' మూవీలో కీలక పాత్ర పోషించిన నటి నదియా కూడా ఇందులో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.


ఈ సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సమయంలో రిలీజ్ చేయడం హాట్ టాపిక్ అయింది. మహేష్ బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం' మూవీ ఏప్రిల్ 29న విడుదలవుతోంది. మహేష్ బాబు సినిమాలు ఎలాగూ అనుకున్న సమయానికి రిలీజ్ కావు.... వాయిదా పడే అవాకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని ముందే గ్రహించిన త్రివిక్రమ్ ఇలా ప్లాన్ చేసాడని అంటున్నారు. మరి త్రివిక్రమ్ ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

English summary
Samantha came with shocking conditions for the filmmakers of Nitin-Trivikram's A..Aa. Buzz is filmmakers planned to shoot a bathroom scene and Samantha refused to do either in hotels or any rooms. So filmmakers specially erected a bathtub set in a studio in Hyderabad and finished the scene.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu