»   » మళ్లీ అదే దర్శకుడుకి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్

మళ్లీ అదే దర్శకుడుకి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : రామ్ చరణ్ తో 'రచ్చ' చిత్రం రూపొందించిన సంపత్ నందికి పవన్ కళ్యాణ్ ఆఫర్ ఇచ్చినట్లు గా వార్తలు గత కొద్ది రోజులుగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పవన్,సంపత్ నందిల కాంబినేషన్ పట్టాలు ఎక్కటం లేదని తెలుస్తోంది. దాంతో రామ్ చరణ్ తాను ఆ కథని చేస్తానని ఆసక్తి చూపటంతో మళ్లీ అదే హీరోతో సంపత్ నంది కంటిన్యూ అవనున్నారని సమాచారం. మళ్లీ హిట్ కాంబినేషన్ అయితే బిజినెస్ పరంగా కూడా మంచి క్రేజ్ ఉంటుందని భావిస్తున్నారు.

  నాలుగు రోజుల క్రితం ఛోటా మేస్త్రి టైటిల్ తో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ ని సంపత్ నంది వినిపించారని, అది రామ్ చరణ్ కి చాలా బాగా నచ్చిందని తెలుస్తోంది. వెంటనే మనమే చేద్దాం అని ఫిక్స్ అయి తండ్రి దగ్గరకు పంపారని తెలుస్తోంది. చిరంజీవి సైతం ఈ కొత్త స్క్రిప్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తన గత చిత్రాలు మాదిరిగా యాక్షన్,సెంటిమెంట్ కలగలిపిన కథలకు ప్రయారిటీ ఇవ్వాలనే చిరంజీవి ఆలోచన,ఈ కథలో కనిపించిందని తెలుస్తోంది.

  ప్రస్తుతం రామ్ చరణ్...వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో 'నాయక్‌'. 'ది లీడర్' అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కాజల్‌, అమలాపాల్‌ హీరోయిన్లు గా చేస్తున్నారు జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ క్యారక్టర్ సమాజానికి ఉపయోగపడేలా ఉంటుంది. రామ్ చరణ్ ని అన్యాయాన్ని ఎదిరించే యువకుడిగా చూపిస్తున్నారు. గతంలో రామ్ చరణ్ తండ్రి చిరంజీవి చిత్రాలలో కూడా హీరో ..సమాజంలో జరిగే అన్యాయాలను ఎదురించి పోరాడే వాడు. అదే స్టైల్ లో రామ్ చరణ్ కూడా మెగాభిమానులను అలరించనున్నారు.

  అలాగే రామ్ చరణ్ తేజ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఎవడు'. ఈ చిత్రం ఏప్రియల్ 5,2013 వ తేదిన విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నామని దర్శకుడు వంశీ పైడిపల్లి మీడియాకు తెలియచేసారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ చిత్రంలో రామ్ చరణ్ కి విలన్ గా మారారు. ఈ చిత్రంలో సమంతను లీడ్ హీరోయిన్ గా చేస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో సమంతతో పాటు సెకండ్ హీరోయిన్‌గా బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్‌ను కూడా ఎంపిక చేశారు. 'మద్రాసు పట్టణం' అనే సినిమా ద్వారా భారతీయ సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్రిటిష్ మోడల్, ఆతర్వాత 'ఏక్ దివానాథా' అనే హిందీ చిత్రంతో పాటు, తాండవం అనే తమిళ చిత్రంలో కూడా అవకాశం దక్కించుంది. రామ్ చరణ్ 'ఎవడు' సినిమా ఆమెకు తొలి తెలుగు సినిమా కాబోతోంది.

  English summary
  
 Sampath Nandi already proved his mettle with Racha, starring Ram Charan, and the director is planning to team up with the actor again. Buzz is that Sampath has narrated another action script to Ram Charan and the film is tipped to be titled Chota Mesthri. Ram Charan and megastar Chiranjeevi are yet to give the nod for Sampath Nandi's script.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more