»   » నిర్మాతగా మారుతున్న గబ్బర్ సింగ్-2 డైరెక్టర్!

నిర్మాతగా మారుతున్న గబ్బర్ సింగ్-2 డైరెక్టర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sampath Nandi
హైదరాబాద్: ఏమైంది ఈ వేళ, రచ్చ చిత్రాలతో దర్శకుడిగా తన టాలెంట్ ఏమిటో నిరూపించుకున్న దర్శకుడు సంపత్ నంది అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ 'గబ్బర్ సింగ్-2' చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సంపత్ నంది గురించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది.

సంపత్ నంది నిర్మాతగా అవతారం ఎత్తబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. సంపత్ నంది టీమ్ వర్క్స్ పేరుతో ఓ బ్యానర్ నెలకొల్పి సినిమాలు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సాయికుమార్ తనయుడు ఆది హీరోగా నవీన్ గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

ఇక సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న 'గబ్బర్ సింగ్-2' సినిమా వివరాల్లోకి వెళితే...ఈ నెలాఖరులోగానీ, వచ్చే నెలలోగానీ ఆ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ తొలి భాగం గుంటూరు జిల్లా కొండవీడు నేపథ్యంలో సాగిన సంగతి తెలిసిందే. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ వెంకట రత్నం నాయుడు అలియాస్ గబ్బర్ సింగ్‌గా దర్శనమిచ్చారు......సీక్వెల్ గబ్బర్ సింగ్ 2లోనూ పవన్ క్యారెక్టర్ అదే అయినప్పటికీ, సినిమా మధ్య ప్రదేశ్‌లోని చంబల్ లోయ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించేది ఎవరు? అనేది ఇంకా ఖరారు కాలేదు. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించి నేపథ్యంలో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

English summary
Film Nagar Sources say that Sampath Nandi has set up a new banner by the name Sampath Nandi Teamworks and he is gearing up to produce a new movie which will directed by Naveen Gandhi with Sai Kumar’s son Aadi as the lead actor!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu