»   » పవన్ కళ్యాణ్ వద్ద పంచాయితి, ఫామ్ హౌస్ లో డిస్కషన్స్

పవన్ కళ్యాణ్ వద్ద పంచాయితి, ఫామ్ హౌస్ లో డిస్కషన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ అఫీషియల్ గా తెలుగు సినిమా హిస్టరిలోనే పెద్ద డిజాస్టర్ గా నమోదైంది. బాహుబలిని బెంచ్ మార్కుగా పెట్టుకుని, ఆకాశాన్ని అంటే రేట్లుకు ఈ చిత్రాన్ని అమ్మేయటమే ఇప్పుడు సమస్యగా మారింది. మినిమం చిత్రం కలెక్షన్స్ కూడా నమోదు చేయలేకపోయింది. అయితే ఈ చిత్రానికి యాభై కోట్లు వచ్చిందని ప్రకటనలు మాత్రం చేస్తూ ఫ్యాన్స్ లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

అందుతున్న సమచారం ప్రకారం ఇలాంటి విపత్కర పరిస్దితుల్లో డిస్ట్రిబ్యూటర్స్ అంతా కలిసి మీటింగ్ పెట్టుకుని, పవన్ కళ్యాణ్ ని దగ్గర తమ సంగతేంటని అడగాలనకుంటున్నట్లు సమాచారం. అయితే పవన్ ఇప్పటికే తన వద్ద ఏమీ లేదని , చివరకు ఆఫిస్ బిల్లులు కూడా కట్టడం లేద్నట్లుగా మీడియా వద్ద చెప్పి ఉన్నాడు.


Sardaar:Distributors planning to meet Pawan Kalyan

ఇప్పటివరకూ పవన్ మాత్రం ఈ సినిమా గురించి మాత్రం మాట్లాడలేదు. హిట్, ఫ్లాఫ్ అనే విషయం కమిటవ్వటం లేదు. కానీ ఈ విషయమై పవన్, శరద్ మరార్ మల్లగుల్లాలు పడుతున్నట్లు చెప్తున్నారు.


కానీ మీడియాలో మరో వర్గం మాత్రం పవన్ ఈ విషయం ప్రక్కన పెట్టి తన తదుపరి చిత్రం ఎస్ జె సూర్య చేసేదాని కోసం తన ఫామ్ హౌస్ లో స్టోరీ డిస్కషన్స్ జరుపుతున్నట్లు చెప్తున్నారు. మరి ఈ పంచాయితి ఎక్కడకిదాకా వెళ్తుందో చూడాలి.

English summary
With losses running into crores, ‘Sardaar Gabbar Singh‘ distributors are now planning to get together and then meet Pawan Kalyan,to see if he can bail them out.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu