»   » ఆంధ్రాలో వద్దని...పవన్ కళ్యాణ్ నిర్ణయం?

ఆంధ్రాలో వద్దని...పవన్ కళ్యాణ్ నిర్ణయం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. ఈ చిత్రం ఆడియోని హైదరాబాద్, అమరావతిలలో రెండు చోట్లా భారీ ఎత్తున జరపటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గారని తెలుస్తోంది.

కేవలం హైదరాబాద్ లో మాత్రమే చేస్తే చాలని ఫిక్స్ అయ్యారని చెప్పుకుంటున్నారు. హైదరాబాద్ లో అయితే అభిమానులందరికీ ఈజీగా ఏక్సెస్ ఉంటుందని ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయం అభిమానుల ద్వారా తెలుసుకున్న పవన్ ...అమరావతి విషయం కాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది.


చిత్రం విశేషాలకు వస్తే... ‘సర్దార్ గబ్బర్‌సింగ్' షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్ కోసం 100 గుర్రాలను రంగంలోకి దింపారు. ఆ గుర్రాలను స్వారీ చేసేందుకు ఉన్న టీమ్, ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టుల సహా మూడు రకాల యూనిట్‌లతో కలిపి మొత్తంగా 1000మందితో షూటింగ్ లోకేషన్ సందడిగా ఉంది.


సర్దార్ గబ్బర్ సింగ్.. సెట్స్‌లో పవన్ కళ్యాణ్-కాజల్ (ఫోటోస్)


 ‘Sardaar Gabbar Singh’: audio launch in Amravathi dropped

హార్స్ మేళా సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సన్నివేశం కోసం 40 మంది ఆర్టిస్టులు, 10 వింటేజ్ కార్లతో పాటు కొన్ని ఖరీదైన లగ్జరీ కార్లు ఉపయోగిస్తున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. భారీ ఖర్చుతో తెరకెక్కిస్తోన్న ఈ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు.


హై టెక్నికల్, ప్రొడక్షన్ వాల్యూస్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే హైదరాబాద్, బరోడ, రాజ్‌కోట్, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


చూస్తూంటే ఏమనిపిస్తోంది? :తన టీమ్ తో పవన్ (కొత్త ఫొటోలు)


 ‘Sardaar Gabbar Singh’: audio launch in Amravathi dropped

ఏప్రిల్ 8న ఈ సినిమా ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన కాజల్ అగర్వాల్ జోడీ కట్టగా...బ్రహ్మానందం, అలీ, తనికెళ్లభరణి, పోసాని కృష్ణమురళి, ముకేష్ రుషి, కబీర్‌సింగ్, కృష్ణభగవాన్, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, ఊర్వశి, లక్ష్మీ రాయ్, షకలక శంకర్, సుడిగాలి సుధీర్, వేణు, రఘుబాబు వంటి భారీ తారాగణంతో రూపొందుతోంది.

English summary
‘Sardaar Gabbar Singh’ makers have dropped the Amaravathi option and wants to complete the event in Hyderabad it self.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X