»   » సర్దార్: టిక్కెట్లు కన్నా స్క్రాఫ్ లే ఎక్కువ అమ్మారు

సర్దార్: టిక్కెట్లు కన్నా స్క్రాఫ్ లే ఎక్కువ అమ్మారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ కలెక్షన్స్ ..రెండో రోజు నుంచే ఊహించని విధంగా స్లో అవటం మొదలై, డ్రాప్ అయ్యాయి. అయితే టిక్కెట్లు అమ్మకం కన్నా చిత్రంలో పవన్ వాడినటువంటి రెడ్ స్క్రాప్ లు ధియోటర్ దగ్గర అమ్మితే ఎలా ఉంటుందనే ఐడియా హైదరాబాద్ లో ఓ ధియోటర్ వారికి వచ్చింది.

మేనేజ్మెంట్ ... రెడ్ స్క్రాఫ్ లను ధియేటర్ ప్రాగణంలో అమ్మటం మొదలెట్టారు. అయితే చిత్రం ఏమిటీ అంటే ...తొలిరోజు టిక్కెట్లు కన్నా స్క్రాఫ్ లే ఎక్కువ అమ్మారని సమచారం. దాదాపు ధియేటర్ కు వచ్చిన ప్రతీ పవన్ అభిమాని తలో స్క్రాఫ్ కొనుక్కుని పండుగ చేసుకున్నారు.


 Sardaar Gabbar Singh Sells More Scarfs

స్క్రాఫ్ ముఖానికి వేసుకుని..సెల్పీ దిగి ఫేస్ బుక్, ట్విట్టర్ లలో పోస్ట్ చేయటం జరిగింది. ఇక టిక్కెట్లు దొరకని వాళ్లు కూడా వెనక్కి వెళ్లిపోతూ ఈ స్క్రాఫ్ నే కొనుక్కుని వెళ్ళటం జరిగింది. దాంతో ఊహించని లాభం ఈ స్క్రాఫ్ లతో వచ్చిందని ధియోటర్ వారు మురిపోతూ చెప్తున్నారు.


ఈ ఆలోచనను మిగతా ధియేటర్ వాళ్లు కూడా అమలు చేద్దామనుకునే లోగా సినిమాకు బ్యాడ్ టాక్ రావటం జరిగింది. దాంతో సినిమా కలెక్షన్స్ డ్రాప్ అవుతున్న సమయంలో వీటిని తెచ్చి ఏం చేసుకుంటాం అని వాళ్లు విరమించుకున్నారని తెలుస్తోంది. అదండీ సంగతి .

English summary
The number of Sardaar scarfs sold is much bigger than the total number of tickets sold in a day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu