»   » రామ్ చరణ్‌ కి విలన్‌ గా సరైనోడే దొరికాడు

రామ్ చరణ్‌ కి విలన్‌ గా సరైనోడే దొరికాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు యంగ్ హీరోలకు మంచి డిమాండ్ మొదలైంది. యంగ్ హీరోలు ఢీ కొనేందుకు యంగ్ విలన్స్ అయితేనే బాగుంటారని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు. దాంతో యంగ్ విలన్స్ కు డిమాండ్ పెరుగుతోంది. అలా క్రేజ్ తెచ్చుకున్న యంగ్ విలన్ ..ఆది పినిశెట్టి.

బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన 'సరైనోడు'లో అల్లు అర్జున్‌ని ఢీ కొట్టే విలన్‌ పాత్రలో కనిపించాడు ఆది పినిశెట్టి. ఇప్పుడు రామ్‌చరణ్‌ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నట్టు సమాచారం. రామ్ చరణ్ తాజాగా సుకుమార్ డైరెక్షన్లో కొత్త సినిమాని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. జనవరి 30న లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రంలో విలన్ గా ఆది పినిశెట్టిని తీసుకుంటున్నట్లు సమాచారం.

Sarrainodu Villain in Ram Charan-director Sukumar's film

అలాగే..ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. ఇప్పుడు మరో పాత్ర కోసం ఆది పినిశెట్టిని ఎంచుకొన్నారని సమాచారం. ఇది కూడా విలన్‌ తరహా పాత్రా? లేదంటే పాజిటివ్‌గా సాగుతుందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఈ సినిమా కోసం 'పల్లెటూరి ప్రేమలు' అనే పేరు పరిశీలిస్తున్నారట.

సుకుమార్ 'నాన్నకు ప్రేమతో' చిత్రంతో, చరణ్ 'ధృవ' సినిమాతో మంచి సక్సెస్ లు అందుకున్న తర్వాత కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి. పైగా ప్రారంభోత్సవం రోజున విడుదల చేసిన ఫస్ట్ లుక్ కూడా అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది.

English summary
Aadi Pinisetty is all set to lock horns with Ram Charan in his next film. The film will be directed by Sukumar and it has been launched recently.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu