రామ్ చరణ్ 'రచ్చ'లో ఆ యంగ్ హీరోది కూడా కీ రోలే
రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చలో మరో యంగ్ హీరో శర్వానంద్ కూడా కీ రోల్ పోషించనున్నాడు. ఈ మధ్యనే రామ్ చరణ్ మాట్లాడుతూ..తనకు తెలుగు పరిశ్రమలో రానా, శర్వానంద్ ఇద్దరే బెస్ట్ ప్రెండ్స్ అన్నారు. అలాగే ఆ మాటను నిలబెట్టుకుంటూ ఖాళీగా ఉన్న శర్వానంద్ కి తన చిత్రంలో కీలకమైనపాత్రను ఆఫర్ చేసారు. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో సోనూసూద్ విలన్ గా చేస్తున్నారు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని పరాస్ జైన్, ఎన్ వి ప్రసాద్ నిర్మిస్తున్నారు. సంపత్ నంది ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందు్తున్న ఈ చిత్రం జూన్ ఒకటవ తేదీ నుంచి షూటింగ్ కి వెళ్ళనుంది.


Click it and Unblock the Notifications











