»   » వర్మని ప్రభాస్ హర్ట్ చేసాడా?

వర్మని ప్రభాస్ హర్ట్ చేసాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సాధారణంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన స్టేట్ మెంట్స్ తో ఎవరో ఒకరికి చురకలేస్తూ హర్ట్ చేస్తూంటారు. అయితే తాజాగా ఆయన వంతు వచ్చిందంటున్నారు. స్టార్ హీరో ప్రభాస్ ఆయన్ని హర్ట్ చేసారంటున్నారు. రీసెంట్ గా ప్రభాస్ తో ఆయన పూర్తి స్ధాయిలో టచ్ లో ఉంటున్నారని, త్వరలో ప్రభాస్ తో సినిమా చేసే అవకాసం ఉందని చెప్పుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ప్రభాస్ ని సత్య 2 చిత్రం ఆడియో పంక్షన్ కి గెస్ట్ గా పిలిచారని, ప్రభాస్ హ్యాండ్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు.

సత్య 2 ఆడియో పంక్షన్ రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. వర్మ సన్నిహితులు అంతా ఈ వేడుకకు హాజరయ్యి విషెష్ తెలియచేసారు. ప్రభాస్...పూర్తిగా బాహుబలి షూటింగ్ లో మునిగిపోయాడని, ఆ గెటప్ రివిల్ చేయటం ఇష్టం లేకే బయిటకు రాలేదని అంటున్నారు. అయితే ఈ విషయం వర్మకు తెలియచేయలేదని, అందుకే వర్మ హర్ట్ అయ్యాడని చెప్పుకుంటున్నారు.

బాహుబలి చిత్రంలో ప్రభాస్ పోరాట యోధుడైన రాజు పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ ఆద్వర్యంలో 'బాహుబలి' చిత్రం కోసం అద్భుతమైన సెట్టింగ్స్ వేసారు. అలనాటి రాచరికానికి దర్పణంలా ఈ సెట్టింగ్స్ ఉంటాయని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.

ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. 'బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు.

English summary
Ram Gopal Varma's next in Telugu after the failures of 'Rakta Charithra' and 'Appalraju' is 'Satya 2' with Sharwanand in the lead and yes, this film is being made in Hindi and Tamil as well paralelly.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu