For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరంజీవి మూవీలో నయనతార భర్తగా యంగ్ హీరో: ఆ క్రూరమైన పాత్రకు అతడు సరిపోతాడా!

  |

  సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలోనే ఆయన జెట్ స్పీడుతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటించిన ఆయన.. ప్రస్తుతం 'ఆచార్య' అనే మూవీని చేస్తున్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తోన్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. మరో రెండు పాటలు అయితే ఈ మూవీ షూటింగ్ పూర్తవుతుంది. ఇదిలా ఉండగానే చిరంజీవి ఇటీవలే మరో సినిమాను పట్టాలెక్కించేశారు. తాజాగా ఈ ఫిల్మ్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

  లూసీఫర్ రీమేక్ చేస్తున్న చిరంజీవి

  లూసీఫర్ రీమేక్ చేస్తున్న చిరంజీవి

  మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో ‘లూసీఫర్' రీమేక్ ఒకటి. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. దీన్ని ఇప్పుడు మోహన్ రాజా.. చిరంజీవి హీరోగా తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

  సెక్స్ లేకుండా ఉండలేవా: శృతి హాసన్‌కు నెటిజన్ సూటి ప్రశ్న.. చీకట్లో ఉంటే అంటూ షాకింగ్ ఆన్సర్!

  పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్.. మార్పులతో

  పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్.. మార్పులతో

  లూసీఫర్ మూవీ పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో తెరకెక్కింది. ఇప్పుడు తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో చక్రం తిప్పే వ్యక్తిగా నటిస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి ‘గాడ్ ఫాదర్' అనే టైటిల్ పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ వైభవంగా ప్రారంభం అయింది.

  చిరంజీవి సినిమాలో సత్యదేవ్ పాత్ర

  చిరంజీవి సినిమాలో సత్యదేవ్ పాత్ర

  విలక్షణమైన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నటుడు సత్యదేవ్. కొద్ది రోజుల క్రితం ఇతగాడిని చిరంజీవి స్వయంగా ఇంటికి పిలిచి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అది లూసీఫర్ రీమేక్‌లోనే అన్న విషయం తెలిసిందే. మలయాళంలో థ్రివినో థామస్ పోషించిన ముఖ్యమంత్రి పాత్రనే అతడు చేస్తున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.

  అషు రెడ్డి క్యారెక్టర్‌పై కమెడియన్ సంచలన వ్యాఖ్యలు.. అందుకే అలా చూపిస్తూ తిరుగుతుందంటూ!

  నయనతార కూడా ఫిక్స్ అయింది

  నయనతార కూడా ఫిక్స్ అయింది

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేశారు. అదే సమయంలో మలయాళంలో లేకపోయినా.. ఇందులో ఓ హీరోయిన్ పాత్రను క్రియేట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో నటించేందుకు గానూ లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే, ఆమె పాత్రపై క్లారిటీ రావట్లేదు.

  ఇద్దరి పాత్రలపై క్లారిటీ వచ్చేసింది

  ఇద్దరి పాత్రలపై క్లారిటీ వచ్చేసింది

  చిరంజీవి ‘లూసీఫర్' రీమేక్ మూవీలో నయనతార, సత్యదేవ్ పోషించే పాత్రల విషయంలో తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. మలయాళంలో మంజు వారియర్ పోషించిన హీరో సోదరి పాత్రను నయనతార చేస్తుందట. అలాగే, ఆమె భర్తగా నటించిన వివేక్ ఒబెరాయ్ రోల్‌ను టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

  Bazar Rowdy Twitter Review: భారీ హిట్ తర్వాత బజార్‌ రౌడీగా సంపూ.. ప్లస్ మైనస్ ఇవే.. ఎలా ఉందంటే!

  Megastar Chiranjeevi Birthday Wishes To Kaikala Satyanarayana ​| Filmibeat Telug
  అంత క్రూరమైన పాత్రను చేస్తాడా?

  అంత క్రూరమైన పాత్రను చేస్తాడా?

  మలయాళంలో వివేక్ ఒబెరాయ్ పోషించిన పాత్ర ఎంతో క్రూరంగా ఉంటుంది. ఒకపక్క హీరో సోదరికి రెండో భర్తగా ఉన్న అతడు.. ఆమె కూతురితో అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు. డ్రగ్స్ అలవాటు చేయడంతో పాటు లైంగికంగా వేధిస్తుంటాడు. అతడి నుంచి ఆమెను హీరో కాపాడతాడు. ఇప్పుడా క్రూరమైన పాత్రనే సత్యదేవ్ చేస్తున్నాడని అంటున్నారు. దీంతో అంతా షాక్ అవుతున్నారు.

  English summary
  Tollywood Star Hero Megastar Chiranjeevi Will do ‘Lucifer’ Remake. Now Young Hero Satyadev Kancharana to play Nayanthara Husband Role in This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X