»   » హీరోయిన్ కోసం హీరో, డైరక్టర్ ఎడతెగని పోరు

హీరోయిన్ కోసం హీరో, డైరక్టర్ ఎడతెగని పోరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాణా, సెల్వరాఘవన్ ప్రాజెక్టు ప్రారంభమవుతుంది అనుకున్న దిసలో అర్ధాంతరంగా ఆగిపోయి మళ్ళి ఇప్పుడు మొదలు కాబోతోందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడు ఆగిపోవటానికి కారణం హీరోయిన్ దొరక్కే అని వినిపించింది. అందుకోసం ప్రకటన కూడా ఇచ్చారు. అయితే వాస్తవానికి కలర్స్ స్వాతిపై మోజు పడ్డ సెల్వరాఘవన్ ఆమెనే తీసుకోవాలని పట్టుబట్టి ప్రక్కకు తప్పుకున్నాడు. ఇప్పుడు కూడా అదే సిట్యువేషన్ ఎదురౌతోంది. రాణా తన ప్రక్కన లీడర్ భామ రిచానే హీరోయిన్ గా తీసుకోవాలని పట్టుబడుతున్నాడు. దాంతో సెల్వరాఘవన్ పాత పాటే పాడబోయి ఆగి ఆ అమ్మాయి అయితే కథకు సరిపోదు అని అడ్డు పుల్ల వేస్తున్నాడు. దాంతో కథ మళ్ళీ మొదటకొచ్చింది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించే ఈ చిత్రం ఈ హీరోయిన్ సమస్యతో ముందుకు వెళ్థుందా అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే సురేష్ బాబు మాత్రం కొత్త అమ్మాయిని పరిచయం చేసి ఇద్దరి సమస్యా ఒకేసారి తీరుద్దామనే ఆలోచనతో ఉన్నట్లు చెప్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu