ప్రభాస్ ఫ్యాన్స్ కి మరో షాక్.. ఆ ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ ఔట్.. కారణం అదే ?

ప్రభాస్ ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చాడని తెలిసి ఆనందంలో ఉన్న ప్రభాస్ ఫాన్స్ కి ఆ ఆనందం ఎంతో సేపు లేదు. తాజాగా ప్రభాస్ ప్యాన్ ఇండియా సినిమా గురించి ఒక షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది.. బాహుబలి సినిమా తో ప్యాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత సాహో అనే సినిమా చేశాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఆయన సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్త వహిస్తూ మంచి దర్శకులను ఎంపిక చేసుకుని దాదాపు రాధేశ్యామ్ తర్వాత మరో మూడు సినిమాలు అనౌన్స్ చేశాడు. అయితే తాజాగా అందులో ఒక ప్యాన్ ఇండియా ప్రాజెక్టు నుంచి దర్శకుడు తప్పుకున్నాడని ప్రచారం మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే

చాలా జాగ్రత్తలు తీసుకుంటూ

చాలా జాగ్రత్తలు తీసుకుంటూ

భారీ అంచనాల నడుమ విడుదలైన సాహో సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్లు సాధించింది కానీ హిట్ టాక్ రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన రాధేశ్యామ్ సినిమా కూడా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. సినిమాలో ప్రతి అంశాన్ని కూలంకషంగా పరిశీలిస్తున్న కారణంగా ఈ సినిమా అంతకంతకూ లేట్ అవుతోంది. ఈ సినిమా జూలై నెలలో రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది కానీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రిలీజ్ అవుతుందో లేదో తెలియని పరిస్థితి.

మొత్తం నాలుగు సినిమాలు లైన్ లో

మొత్తం నాలుగు సినిమాలు లైన్ లో

రాధేశ్యామ్ సినిమా సెట్స్ మీద ఉండగానే ప్రభాస్ మరో మూడు సినిమాలు అనౌన్స్ చేశాడు. ముందుగా మహానటి దర్శకుడు నాగఅశ్విన్ దర్శకత్వంలో ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ అనౌన్స్ చేశాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మితం కాబోతోంది. ఈ సినిమాని అనౌన్స్ చేశాక ఆయన బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో మరో సినిమాని అనౌన్స్ చేశాడు. ఆది పురుష్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్నాడు. పౌరాణిక నేపథ్యం ఉన్న సినిమా కావడంతో సాధారణంగానే ప్రేక్షకుల అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కేజిఎఫ్ సినిమాతో కన్నడ సినిమా ఖ్యాతిని భారత వ్యాప్తంగా చాటిన ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సలార్ అనే సినిమా చేస్తున్నాడు.

 క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా

క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా

నిజానికి ప్రభాస్ నాగ అశ్విన్ సినిమా అనౌన్స్ చేసిన కొద్దిరోజులకు అలనాటి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమా కోసం పని చేస్తారని వైజయంతి మూవీస్ సంస్థ ప్రకటించింది. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుందని, స్క్రిప్ట్ విషయంలో కూడా సింగీతం శ్రీనివాసరావు సూచనలు, సలహాలు యూనిట్ తీసుకుంటోందని అప్పట్లో ప్రకటించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు సింగీతం శ్రీనివాసరావు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. సినిమా డైరెక్షన్ టీంతో కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చిన కారణంగా ఆయన సినిమా నుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది.

 ఈ ఏడాది చివర్లో షూటింగ్ ?

ఈ ఏడాది చివర్లో షూటింగ్ ?

అయితే ఆయన తప్పుకున్నారు అన్న విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరోపక్క నాగ్ అశ్విన్ ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రభాస్ 2022 మొత్తం ఈ సినిమా కోసం కేటాయించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకొనేని అనౌన్స్ చేయగా మరో కీలక పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ ను తీసుకుంటున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.

Recommended Video

Karthik Rapolu Gives Suggestions To Debut Directors | Ek Mini Katha
 ఫ్యాన్స్ కి షాక్

ఫ్యాన్స్ కి షాక్

అయితే ఆదిత్య 369 లాంటి సినిమాను ఆ రోజుల్లోనే తీసిన సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం ప్రతిభ ప్రభాస్ సినిమాకు ఉపయోగపడుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయన సినిమా నుంచి వాకౌట్ చేయడంతో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X