For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Poorna Marriage Gift: పూర్ణకు భర్త పెళ్లి కానుక.. బంగారంతో పాటు లగ్జరీ హౌస్.. వాటి ధర ఎంతో తెలిస్తే!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది భామలు తమదైన శైలి నటనతో ఆకట్టుకుంటున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో మలయాళ భామ పూర్ణ అలియాస్ సామ్నా కాశీం ఒకరు. సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో సందడి చేస్తోన్న ఈ భామ.. ఇప్పటికీ సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇక, ఇటీవలే దుబాయ్‌కు చెందిన ఓ బడా బిజినెస్‌మ్యాన్‌ను హీరోయిన్ పూర్ణ వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెకు భర్త ఇచ్చిన కానుకల గురించి ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

  అలా పరిచయం... ఫుల్ ఫేమస్

  అలా పరిచయం... ఫుల్ ఫేమస్

  పూర్ణ అలియాస్ సామ్నా కాశీం 'శ్రీ మహాలక్ష్మీ' అనే సినిమాతో పరిచయమైంది. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ సినిమాలు 'అవును', 'అవును 2' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఈ క్రమంలోనే 'సీమటపాకాయ్', 'సిల్లీ ఫెలోస్', 'అదుగో', 'రాజుగారి గది', 'మామ మంచు అల్లుడు కంచు' సహా ఎన్నో చిత్రాలు చేసి ఫేమస్ అయింది.

  వంద కోట్ల దర్శకుడితో బాలయ్య: పాన్ ఇండియాపై దండయాత్ర.. టాప్ ప్రొడ్యూసర్ భారీ ప్లాన్

  బడా బిజినెస్‌మ్యాన్‌తో డేటింగ్

  బడా బిజినెస్‌మ్యాన్‌తో డేటింగ్

  హీరోయిన్ పూర్ణ వరుస సినిమాలతో సత్తా చాటుతోన్న సమయంలోనే.. దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీతో ప్రేమలో పడింది. అలా చాలా కాలం పాటు లవ్ ట్రాక్ నడిపిన తర్వాత వీళ్లిద్దరూ పెద్దలను ఒప్పించారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అప్పుడే వీళ్ల వ్యవహారం బయటకు వచ్చింది.

  దుబాయ్ షేక్‌తో పూర్ణ వివాహం

  దుబాయ్ షేక్‌తో పూర్ణ వివాహం

  టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ పూర్ణ అలియాస్ సామ్నా కాశీం తాజాగా వివాహం చేసుకుంది. దుబాయ్‌లో గత రాత్రి జరిగిన ఈ వేడుకలో జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీని ఆమె పెళ్లాడింది. చాలా నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకకు కేవలం ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఈ వివాహం అరబిక్ స్టైల్‌లో జరిగింది.

  శృతి మించిన అఖండ హీరోయిన్ హాట్ షో: వామ్మో గీత దాటేసిందిగా!

  పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ

  పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ

  దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకున్న తర్వాత హీరోయిన్ పూర్ణ చాలా ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేసింది. అదే సమయంలో తన కెరీర్‌ను ముందుకు సాగిస్తానని కూడా పరోక్షంగా వెల్లడించింది. ఇందులో భాగంగానే ఆమె షూట్‌లలో కూడా పాల్గొనబోతుంది. ఇక, ఇప్పుడు పూర్ణ.. నాని 'దసరా' మూవీలో విలన్‌గా నటిస్తోంది.

  పూర్ణకు భర్త విలువైన కానుకలు

  పూర్ణకు భర్త విలువైన కానుకలు

  జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీతో హీరోయిన్ పూర్ణ వివాహం దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది. అదే సమయంలో వీళ్ల వివాహం గురించి, అది జరిగిన పద్దతి గురించి, కానుకల గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఇక, తాజా సమాచారం ప్రకారం.. నటి పూర్ణకు భర్త షానిద్ కొన్ని కోట్ల విలువైన గిఫ్ట్‌లు అందించాడని ఓ న్యూస్ లీకైంది.

  ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో శృతి హాసన్: లోపలివి కనిపించేలా ఘోరంగా!

  బంగారం ధర తెలిస్తే మెంటలే

  బంగారం ధర తెలిస్తే మెంటలే

  హీరోయిన్‌ పూర్ణకు పెళ్లి సందర్భంగా ఆమె భర్త షానిద్ ఆసిఫ్ అలీ ఎన్నో కానుకలు అందించాడట. మరీ ముఖ్యంగా ఆమెకు 2700 గ్రాముల బంగారాన్ని గిఫ్టుగా ఇచ్చాడని తాజాగా తెలిసింది. దీని విలువ దాదాపు రూ. 1.20 కోట్లు (భారతదేశంలోని ధర ప్రకారం) అని తెలుస్తోంది. అయితే, మన దేశంలో కంటే దుబాయ్‌లో బంగారం ధర చాలా తక్కువ ఉంటుందన్నది తెలిసిందే.

  కోట్ల విలువైన లగ్జరీ హౌస్ కూడా

  కోట్ల విలువైన లగ్జరీ హౌస్ కూడా

  పూర్ణను పెళ్లి చేసుకునే సమయంలోనే షానిద్ అసిఫ్ అలీ ఆమె పేరిట కొన్ని ఆస్తులను కూడా రాశాడని తెలిసింది. మరీ ముఖ్యంగా దుబాయ్‌లో ఓ లగ్జరీ హౌస్‌ను ఆమెకు గిఫ్టుగా అందించాడట. దీని విలువ దాదాపు రూ. 20 కోట్లు వరకూ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, కంపెనీలోని కొన్ని షేర్లను కూడా ఆమె పేరిట రాశాడట. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది.

  English summary
  Actress Poorna AKA Shamna Kasim Gets Married To Her Boyfriend Shanid asifali Recently. Now Her Marriage Gift Hot Topic In Industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X